Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ప్రధాని మోదీతో చంద్రబాబు గంటసేపు భేటీ

Published on Jan 12 2018 // News

పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు.

రాష్ట్రానికి నెరవేర్చాల్సిన హామీలతో కూడిన 17 పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి అందజేశారు.

పోలవరం ప్రాజెక్టుకు రూ.58వేల కోట్లతో సమర్పించిన పూర్తి స్థాయి అంచనాల్ని ఆమోదించడం, రాజధాని అమరావతి నిర్మాణం కోసం వచ్చే కేంద్ర బడ్జెట్‌లో తగినన్ని నిధులు కేటాయించడం,

రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచడంతోపాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని ఈ సందర్భంగా ప్రధానిని కోరారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇంతవరకూ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో ఇంకా కేంద్రం నుంచి సుమారు రూ.3వేల కోట్లు రావాల్సి ఉంది. ఆ మొత్తం వెంటనే ఇప్పించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలని కోరారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.58వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు అథారిటికీ సవరించిన అంచనాలు సమర్పించిన నేపథ్యంలో, వాటిని ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, విధి విధానాలు ఖరారు చేసి, నోటిఫికేషన్‌ జారీ చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని విన్నవించారు.

ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఈఏపీ రుణాల గురించి సీఎం ప్రత్యేకంగా చర్చించారు. వీటి కింద రూ.20,010 కోట్లు రావాల్సి ఉండగా, ఐదేళ్లలో ఇంత మొత్తాన్ని ఈఏపీ ప్రాజెక్టులపై ఖర్చు పెట్టే సామర్థ్యం తమకు లేదని వివరించారు.

ఆ మొత్తంతో పాత విదేశీ రుణాలు, చిన్న పొదుపు మొత్తాలు, నాబార్డు రుణాలు చెల్లించేందుకు, దేశీయ బ్యాంకులు, నాబార్డు, హడ్కో వంటి సంస్థల నుంచి రుణాలు తీసుకోవడానికి అనుమతించాలని కోరారు.

అరుణ్‌ జైట్లీకి రాసిన లేఖలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. విశాఖలో రైల్వే జోన్‌, అమరావతి మెట్రో రైల్‌, తదితర అంశాలపైనా మోదీతో చంద్రబాబు చర్చించారు.

Leave a comment