Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

మీడియా ముందుకు న్యాయ‌మూర్తులు

Published on Jan 12 2018 // News

న్యాయచరిత్రలో తొలిసారిగా దేశ సర్వోన్నత న్యాయస్థాన సీనియర్‌ న్యాయమూర్తులు మీడియాతో మాట్లాడారు. అది కూడా ఒకేసారి నలుగురు జడ్జీలు మీడియా ముందుకు వచ్చారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నివాసంలో చలమేశ్వర్‌ సహా సీనియర్‌ జడ్జీలు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ కీలక సమావేశం ఏర్పాటుచేశారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పాలనా వ్యవస్థపై సీనియర్‌ న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ మాట్లాడుతూ భారత చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న సమావేశం ఇది.

స్వేచ్ఛాయుత న్యాయవ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం మనలేదు. సుప్రీంకోర్టు పవిత్రత నిలబడలేకపోతే ప్రజాస్వామ్యానికి చేటు. సుప్రీంకోర్టులో పాలనా వ్యవస్థ సరైన క్రమంలో లేదు.

గత కొన్ని రోజులుగా సుప్రీంకోర్టులో అవాంఛిత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై మేం నలుగురం చర్చించి కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాం. పాలనా వ్యవస్థను సరిదిద్దాలని కోరాం.

అయితే ఆయనను ఒప్పించడంలో మేం విఫలమయ్యాం. జరుగుతున్న పరిణామాలను ప్రజలకు చెప్పడం తప్ప మా ముందు మరో మార్గం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చాం. ఇలా సమావేశం పెట్టడం బాధాకరమే అయినా తప్పలేదు. సుప్రీంకోర్టు వ్యవస్థకు, దేశానికి మేం బాధ్యత కలిగి ఉన్నాం.

జరుగుతున్న పరిణామాలపై దేశానికి పూర్తి వివరాలు తెలియజేస్తూ మేం మా బాధ్యతను నిర్వర్తిస్తున్నాం’ అని అన్నారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు పంపించిన ఏడు పేజీల లేఖను జడ్జీలు మీడియాకు ఇచ్చారు.

ఆ లేఖలో ఏముదంటే..

‘సుప్రీంకోర్టు వెలువరించిన కొన్ని తీర్పులు న్యాయవ్యవస్థ పనితీరు, హైకోర్టుల స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపించే విధంగా ఉన్నాయని మేం భావిస్తున్నాం. కొన్ని కేసుల విచారణలో ధర్మాసనాల కేటాయింపు హేతుబద్ధంగా జరగక.. ‘వారికి అనుకూలంగా’ మాత్రమే జరిగింది.

సుప్రీంకోర్టు వ్యవస్థకు ఇబ్బందులు తీసుకురాకుండా ఉండేందుకు వాటి గురించి మేం ఇక్కడ వివరాలను ప్రస్తావించడంలేదు. కానీ వాటి వల్ల సుప్రీం వ్యవస్థకు కొంత నష్టం జరిగింది.

సుప్రీం న్యాయమూర్తుల్లో సమానంగా ఉండే వారిలో ముందుండే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఎవరికీ ఎక్కువ కాదు.. తక్కువ కాదు.’ అని లేఖలో పేర్కొన్నారు.

Leave a comment