Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

గ్యాంగ్ సినిమా స‌మీక్ష‌

Published on Jan 12 2018 // Movie News

తెలుగు స్టార్ క‌థానాయ‌కుల స్థాయిలో త‌నకు మార్కెట్‌ని సృష్టించుకొన్నారు సూర్య. అందుకే ఆయ‌న సినిమాల‌పై త‌మిళం స్థాయిలోనే తెలుగులో అంచ‌నాలు క్రియేట్ అవుతుంటాయి.

ఈ సంక్రాంతికొస్తున్న సినిమాల్లో `గ్యాంగ్‌` కూడా ఓ కీల‌క‌మైన సినిమాగా ప‌రిగ‌ణిస్తూ వ‌చ్చారంతా. హిందీలో విజ‌య‌వంత‌మైన `స్పెష‌ల్ ఛ‌బ్బీస్‌` స్ఫూర్తితో యువ దర్శకుడు విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన చిత్రమిది. ఈ చిత్రం కోసం తొలిసారి సూర్య తెలుగులో డ‌బ్బింగ్ చెప్పడం విశేషం. మ‌రి సూర్య `గ్యాంగ్‌` ఎలా ఉంది? ఆయ‌న సంక్రాంతి విజేత‌గా నిలుస్తాడా లేదా?

కథేంటంటే: బాగా చదువుకున్న తిలక్‌ (సూర్య) ఎప్పటికైనా సీబీఐ ఆఫీసర్‌ కావాలని కలలు కంటుంటాడు. కానీ, తన తండ్రి సీబీఐలో ఓ క్లర్క్‌ కావడంతో ఇంటర్వ్యూలో అవమానం జరుగుతుంది.

ఉద్యోగం రాదు. తిలక్‌ స్నేహితుడు పోలీసు కావాలని కలలు కంటుంటాడు. లంచం ఇస్తేనే ఉద్యోగం అని చెప్పడంతో వేరే దారిలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఇవన్నీ చూసి కడుపు మండిన తిలక్‌ తనే అనధికారికంగా సీబీఐ అధికారి అవతారం ఎత్తాలని నిర్ణయించుకుంటాడు.

తనలాగే కష్టాల్లో ఉన్న వారితో కలిసి ఒక గ్యాంగ్‌ను కూడా ఏర్పాటు చేస్తాడు. సీబీఐ పేరు చెప్పి అక్రమార్కుల నుంచి డబ్బు కాజేయడమే ఈ గ్యాంగ్‌ పని. ఆ డబ్బునంతా సొంతానికి కాకుండా మంచి పనుల కోసం వినియోగిస్తుంటారు. మరి ఈ గ్యాంగ్‌ను పట్టుకునేందుకు నిజమైన సీబీఐ అధికారులు ఏం చేశారు? గ్యాంగ్‌ సభ్యులు పట్టుబడ్డారా?లేదా? తదితర విషయాలను తెరపై చూడాల్సిందే…

ఎలా ఉందంటే:
1987 నేపథ్యంలో జరిగే కథ ఇది. ప్రభుత్వ అధికారుల్లో అవినీతిని ఎత్తిచూపుతూ వారి బాధ్యతను గుర్తు చేస్తుంది.

తొలి సగభాగం సినిమా పాత్రల నేపథ్యాన్ని పరిచయం చేస్తూ నకిలీ సీబీఐ గ్యాంగ్‌ అక్రమార్కుల సొమ్మును కాజేసే సంఘటనలతో సాగుతుంది. ఆ సన్నివేశాల్లోనే వినోదాన్ని మేళవించడంతో సరదా సరదాగా సాగుతుంది.

గ్యాంగ్‌ ఎందుకు కట్టాల్సి వచ్చిందో చెబుతూ ఫ్లాష్‌బ్యాక్‌ సన్నివేశాల్ని తీర్చిదిద్దారు. అవి హృదయానికి హత్తుకునేలా ఉంటాయి. విరామం సమయానికి సీబీఐ అధికారులకు గ్యాంగ్‌ ఆచూకీ తెలుస్తుంది. ద్వితీయార్ధం మొత్తం ఆ గ్యాంగ్‌ను వెంటాడే ప్రయత్నం.

గ్యాంగ్‌ కూడా సీబీఐ అధికారులకు దీటుగా ఎత్తుకు పైఎత్తులు వేయడంతో సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. అంతా ఓ ఎత్తైతే.. పతాక సన్నివేశాలు మరో ఎత్తు. అక్కడ మలుపులు, సందేశం హత్తుకునేలా ఉంటాయి.

ఎవరెలా చేశారంటే: సూర్య అభినయం చిత్రానికి ప్రధాన బలం. ఓ మధ్యతరగతి యువకుడిగా, గ్యాంగ్‌కు లీడర్‌గా చక్కటి నటన కనబరిచాడు. సీబీఐ ఆఫీసర్‌ ఝాన్సీరాణిగా మారిన బుజ్జమ్మ పాత్రలో రమ్యకృష్ణ ఆకట్టుకుంటుంది.

సీబీఐ బాస్‌ శివశంకర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు కార్తిక్‌ కనిపించడం బాగుంది. కీర్తిసురేశ్‌ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలకు, కొన్ని సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితం అయ్యింది.

మిగిలిన పాత్రలన్నీ పరిధి మేరకు సందడి చేస్తాయి. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. 1987 నేపథ్యానికి తగ్గట్టుగా సంగీతం అందించడంలో అనిరుధ్‌ చక్కటి పనితీరును కనబరిచారు. దినేశ్‌‌ కృష్ణన్‌ ఛాయాగ్రహణం బాగుంది.

విఘ్నేష్‌ శివన్‌ ‘స్పెషల్‌ 26‌’ స్ఫూర్తితో కథ రాసుకున్నా.. దక్షిణాదికి తగ్గట్టు మార్పులు చేసుకున్నారు. సన్నివేశాల్లోనే వినోదం మేళవించిన తీరు బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు ఆకర్షణగా నిలిచాయి.
చిత్రం: గ్యాంగ్‌
న‌టీన‌టులు:సూర్య.. కీర్తిసురేశ్‌.. కార్తిక్.. రమ్యకృష్ణ.. బ్రహ్మానందం.. క‌లైయ‌ర‌స‌న్‌.. నంద‌, ఆర్జే బాలాజీ.. సెంథిల్.. వినోదిని.. వైద్యనాథన్‌ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం:దినేశ్‌ కృష్ణన్‌

కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌

సంగీతం: అనిరుధ్‌

మాట‌లు: శ‌శాంక్ వెన్నెల‌కంటి

నిర్మాత‌లు: కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా.. వంశీ, ప్రమోద్‌

దర్శకత్వం: విఘ్నేష్ శివ‌న్‌
సంస్థ: స్టూడియో గ్రీన్
సమర్పణ: యు.వి.క్రియేషన్స్

Leave a comment