Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ట్రంప్ మ‌రోసారి వ్యాఖ్య‌ల‌తో దుమారం

Published on Jan 12 2018 // NRI

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి నోరుపారేసుకున్నారు. వలసదారులపై విచక్షణ రహిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది.

వాషింగ్టన్‌ పోస్ట్‌ అందించిన సమాచారం ప్రకారం అతి చెత్త(షిట్‌ హోల్‌) దేశాలనుంచి ఇమ్మిగ్రెంట్స్‌ అమెరికాకు ఎందుకు వస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై డెమెక్రాట్లు,ఇతర రాజకీయ ప్రముఖులు మండిపడుతున్నారు. ట్రంప్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

హైతీ, ఎల్ సాల్వడార్, ఆఫ్రికన్ దేశాలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని బీబీసి రిపోర్ట్‌ చేసింది. వీరికి బదులుగా నార్వే లాంటి దేశాల నుంచి వలస వచ్చిన వారిని నియమించుకోవాలని ట్రంప్‌ తన సభ్యులకు సూచించారు.

గురువారం ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందించిన మేరీల్యాండ్ డెమోక్రాటిక్ చట్టసభ సభ్యుడు ఎలిజా కమ్మింగ్స్ ట్వీట్ చేశారు. ఇది క్షమించరాని ప్రకటన అంటూ తీవ్రంగా ఖండించారు.

ఉటా రిపబ్లికన్, కాంగ్రెస్‌ లో ఏకైక హైతీ-అమెరికన్ మియా లవ్ ఇవి దుర్మార్గమైన, విభజన, అహంకార పూరిత వ్యాఖ్యలని మండిపడ్డారు.

వెంటనే ట్రంప్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌ అజెండా నిజంగా మేక్ అమెరికా వైట్ ఎగైన్‌ ఎజెండా అని మరోసారి రుజువైందని బ్లాక్ డెమోక్రాటిక్ శాసనసభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ విమర్శించారు.

మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్‌ అజెండా నిజంగా మేక్ అమెరికా వైట్ ఎగైన్‌ ఎజెండా అని మరోసారి రుజువైందని బ్లాక్ డెమోక్రాటిక్ శాసనసభ్యుడు సెడ్రిక్ రిచ్మండ్ విమర్శించారు. జాత్యహంకారంతో​ అధ్యక్షుడు ట్రంప్‌ మరింత దిగజారిపోతున్నారని జాతీయ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ అఫ్ కలర్డ్ పీపుల్ ఆరోపించింది.

అటు దీనిపై వైట్హౌస్ ట్రంప్‌ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. కొంతమంది వాషింగ్టన్‌ రాజకీయవేత్తలు విదేశాల కోసం పోరాటం చేస్తోంటే..అధ్యక్షుడు ట్రంప్ అమెరికన్ ప్రజల కోసం పోరాడుతున్నారని వైట్హౌస్ ప్రతినిధి రాజ్ షా ఒక ప్రకటనలో తెలిపారు.

Leave a comment