Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

కేంద్ర మంత్రి గడ్కరీ ఘూటు వ్యాఖ్యలు

Published on Jan 12 2018 // News

భారత నేవీ దళాన్ని ఉద్దేశించి కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఓ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అంగుళం భూమి కూడా ఇచ్చేది లేదని నేవీ విభాగాన్ని ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు.

మేం మిమల్ని గౌరవిస్తాం. ఉగ్రవాదులు చొరబడే సరిహద్దుల్లో నేవీ అవసరం ఉంది. నావికాదళ అధికారులు వచ్చి దక్షిణ ముంబైలో స్థలం కావాలని నన్ను అడిగారు.

నేవీకి చెందిన ప్రతిఒక్కరూ అక్కడే ఎందుకు ఉండాలనుకుంటున్నారు? ఇకపై ఎవరికీ అంగుళం స్థలం కూడా ఇచ్చేది లేదు. ఈ విషయంలో మీరెవరూ నా దగ్గరకు రావొద్దు.

పాక్‌ సరిహద్దుకు వెళ్లి పెట్రోలింగ్‌ చేస్కోండని గడ్కరీ తెలిపారు.

రోడ్డు మార్గం ప్రయాణాలకు వ్యయాలు భారీగా పెరిగిపోతున్న వేళ సీప్లేన్ సర్వీసులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

రానున్న రెండేళ్లలో 10,000 సీ ప్లేన్లను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా అందుకు నేవీ విముఖత వ్యక్తం చేసింది.

ఈ మేరకు ఆపరేటర్లు బాంబే హైకోర్టులో అప్పీల్‌ చేసుకోగా కోర్టు కూడా అందుకు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో గడ్కరీ పై వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వం అంటే నేవీ, డిఫెన్స్‌ మంత్రిత్వ శాఖలు కాదు. మేం అలాంటిది మేం చేపట్టే అభివృద్ధి పనులకు అడ్డుతగలటం మంచిది కాదు’’ అని గడ్కరీ వ్యాఖ్యానించారు.

Leave a comment