Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ప్ర‌యోగానికి సిద్ద‌మైన PSLV-C40

Published on Jan 11 2018 // News

PSLV-C40 ప్రయోగానికి పచ్చజెండా లభించింది. మూడు స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో 42వ సారి రోదసి యానానికి ఈ రాకెట్‌ సిద్ధమైంది.

నెల్లూరు జిల్లాలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనుంది.

ఈ ప్రయోగం కోసం బుధవారం షార్‌లో జరిగిన మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ సమావేశంలోను, షార్‌ డైరెక్టర్‌ కున్హికృష్ణన్‌ ఆధ్వర్యంలో లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమావేశంలోనూ శాస్త్రవేత్తలు ప్రయోగానికి పచ్చజెండా ఊపారు. ఈ ప్రయోగం కోసం గురువారం ఉదయం 5.29 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అవుతుంది.

ఆ సమయంలో రిమోట్‌ ద్వారా రాకెట్‌లోని రెండు, నాలుగు దశల మోటార్లకు ద్రవ ఇంధనం నింపుతారు. 1, 3 దశల ఇంజన్లు ఘన ఇంధనంతో పని చేస్తాయి. శుక్రవారం ఉదయం 9.29 గంటలకు రాకెట్‌ను ప్రయోగించనున్నారు.

ఇవీ ఉపగ్రహాలు
మన దేశానికి చెందిన 710 కిలోల భూ పరిశీలన ఉపగ్రహం కార్టోశాట్‌-2ఈఆర్‌తో పాటు 100 కిలోల మైక్రోశాట్‌, 11 కిలోల నానో ఉపగ్రహాలను ఈ రాకెట్‌ రోదసిలో విడిచి పెట్టనుంది.

అలాగే కెనడా, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, యూకేలకు చెందిన ఒక్కో నానో ఉపగ్రహాన్ని, రిపబ్లికన్‌ ఆఫ్‌ కొరియాకు చెందిన 5, అమెరికాకు చెందిన 19 నానో ఉపగ్రహాలను ఈ రాకెట్‌ ద్వారా వివిధ కక్ష్యల్లోకి ప్రవేశపెడతారు. ఈ 28 విదేశీ ఉపగ్రహాలు 420 కిలోలు బరువుకలిగి ఉన్నాయి.

Leave a comment