Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

సరిహద్దుల్లో చైనా దాగుడు మూతలు

Published on Jan 10 2018 // News

ఈ శీతకాలంలో చైనా బలగాలు భారీ సంఖ్యలో మళ్లీ డోక్లాంలో తిష్ఠ వేశాయని సమాచారం. జన చైనా సైన్యం (పీఎల్‌ఏ) అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకుందని వార్తలు వచ్చాయి. వీటిని భారత రక్షణ, విదేశాంగ మంత్రిత్వ శాఖలు ఖండిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే 2017లో సరిహద్దు వెంట పెద్దయెత్తున దాడులు చోటు చేసుకున్నాయని తెలుస్తోంది. ఈ ప్రకారం సరిహద్దు రేఖ వెంబడి 415 ఆక్రమణలు జరిగాయి. అదే 2016లో అయితే ఇవి 271. పెరుగుతున్న దాడుల సంఖ్య భారత్‌ అప్రమత్తం అవ్వాల్సిన అవసరాన్ని బలంగా సూచిస్తున్నాయి.

సరిహద్దు రేఖ వెంబడి దాదాపు 24 వరకు వివాదాస్పద ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడే ఎప్పుడూ చైనా, భారత్‌ మధ్య గొడవులు జరుగుతుంటాయి.

అందులో చుమార్‌, దెస్పాంగ్‌, దెమ్‌చాక్‌, బరాహోటి, సముదొరంగ్‌ చు ప్రధానమైనవి. ప్రస్తుతం వీటి ఖాతాలో డోక్లాం చేరింది. అత్యంత వివాదాస్పదం అయింది. ప్రపంచ దేశాలను ఆకర్షించింది. అమెరికా, జపాన్‌ వంటి దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి.

డోక్లాం వివాదం ముదిరిన తర్వాత దాదాపు యుద్ధచ్ఛాయలు కనిపించాయి! రెండు దేశాలు నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నాయి.

చైనా సైనిక అధినేత ఇక యుద్ధం తప్పదంటూ ఊకదంపుడు బెదిరింపులకు దిగారు. దానికి మేం ఎల్లప్పుడూ సిద్ధమే అంటూ జడుసుకునేది లేదంటూ భారత్‌ ఘాటుగా తిప్పికొట్టింది.

చివరికి ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లే ముందు రెండు దేశాల దౌత్య అధికారులు చర్చలు వేగవంతం చేసి సమస్యను పరిష్కరించారు. దీంతో రెండు దేశాల సైనిక బలగాలు అక్కడి నుంచి వెనక్కి తగ్గాయి.

డోక్లాం వివాదంలో పైచేయి సాధించలేకపోయిన పీఎల్‌ఏ స్టాఫ్ జనరల్‌ ఫాంగ్‌ ఫెంగ్‌హూయిని వివాదం మధ్యలోనే విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రాపకం కోసం మాజీ అధికారిపై అవినీతి, లంచగొండి తనంపై విచారణ జరుపుతున్నారు.

Leave a comment