Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

పాక్ మీడియాపై ఇమ్రాన్ అస‌హ‌నం..!

Published on Jan 10 2018 // National

పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, ప్రతిపక్ష తెహ్రీక్‌ ఎ ఇన్సాఫ్‌ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ మూడో పెళ్లి చేసుకున్నారంటూ ఇటీవల వరుసగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

దీనిపై స్పందించిన ఇమ్రాన్‌ తాను ఇంకా మూడోపెళ్లి చేసుకోలేదని.. కానీ పెళ్లి ప్రతిపాదన మాత్రం చేసినట్లు వెల్లడించారు.

ఇంత వివరణ ఇచ్చాక కూడా అక్కడి మీడియా తన పెళ్లి వార్తల ప్రసారాన్ని ఆపకపోవడంతో ఆయన అసహనానికి గురయ్యారు. ట్విటర్‌ వేదికగా ఈ విషయంపై తీవ్రంగా మండిపడ్డారు.

‘గత మూడు రోజులుగా వస్తున్న వార్తలను చూసి ఆశ్చర్యపోతున్నా. నేనేమైనా బ్యాంకును చోరీ చేశానా.. లేదా జాతీయ సంపద దోచుకున్నానా.. లేదంటే పాక్‌ రహస్యాలన్నీ భారత్‌కు చెప్పేశానా..? ఇందులో నేనేమీ చేయలేదు.

మూడో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దాన్నే పెద్ద నేరంగా చూస్తున్నారెందుకు? నా గురించి ఆలోచించుకుండా ఈ మీడియా దీనిపై ఎందుకు ఇంత ప్రచారం చేస్తోంది.

కానీ నా బాధంతా నా పిల్లలు, బుష్రా బేగం కుటుంబం గురించే. ఈ వార్తల్లోకి వాళ్లనెందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు’ అంటూ వరుస ట్వీట్లతో ధ్వజమెత్తారు.

ఈ సందర్భంగా పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌పై కూడా ఇమ్రాన్‌ వ్యాఖ్యలు చేశారు. వారు వెనుకుండి తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

నవాజ్‌ కుటుంబం తనకు 40ఏళ్లుగా తెలుసని వారి కుటుంబ రహస్యాలను తాను బయటపెట్టట్లేదుగా అన్నారు. వ్యక్తిగత ఆనందం కోసమే తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. ఆ హక్కు తనకు ఉందన్నారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ రహస్యంగా మూడోపెళ్లి చేసుకున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇమ్రాన్‌.. ఈ వార్తలు ఖండించారు. బుష్రా అనే మహిళకు తాను పెళ్లి ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. అయితే ఆమె కొంచెం సమయం కోరారని, అంగీకారం లభిస్తే పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు.

Leave a comment