Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

సంక్రాతికి బాల‌య్య సినిమా

Published on Jan 09 2018 // Movie News

పంచెకట్టులోన ప్రపంచాన మొనగాడు. కండువా లేనిదే గడపైనా దాటనివాడు. పంచభక్ష్య పరమాణ్ణంబులు పళ్లెమందుచిన గోంగూరకై ఎదురు చూచువాడు.

ఎవడయ్యా? ఇంకెవడు? మన తెలుగువాడు’ అని సినారెగారు నాన్నగారిని ఉద్దేశిస్తూ రాసిన పద్యమది. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులు కోరుకునే నవరసాలు ఉన్న చిత్రమిది’’ అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి. కల్యాణ్‌ నిర్మించిన సినిమా ‘జై సింహా’. నయనతార, హరిప్రియ, నటాషా దోషి హీరోయిన్లు.

చిరంతన్‌ భట్‌ స్వరకర్త. సంక్రాంతి సందర్భంగా ఈ శుక్రవారం విడుదలవుతోన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్‌ అండ్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ ఫంక్షన్‌ సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. బాలకృష్ణతో పాటు చిత్ర బృందానికి దర్శకులు వీవీ వినాయక్‌, బోయపాటి శ్రీను ప్లాటినమ్‌ డిస్కులు అందజేశారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘సినిమా సినిమాకీ వైవిధ్యం ఉండాలి. ప్రేక్షకులకు ఏదో కొత్తదనం ఇవ్వాలనే తపనతో ఈ సినిమా చేశా. మా ఇంట్లోవాళ్లకూ ఈ కథ చెప్పలేదు.

ఇప్పటివరకూ ఏ సినిమాలో రాని ట్విస్ట్‌ ఈ సినిమాలో ఉంది. కేయస్‌ రవికుమార్‌తో ఎనిమిదేళ్లుగా సినిమా చేయాలనుకుంటున్నా. ఇప్పటికి కుదిరింది. సినిమా బాగా వచ్చింది. నేనెప్పటికీ కుర్రాడినే. మనకు వయసుతో సంబంధం లేదు. డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ చేసిన సాంగులో మంచి స్టెప్పులు వేయించారు’’ అన్నారు.

‘‘ప్రేక్షకులందరికీ ప్రేమంటే ఎలా ఉండాలి? అభిమానమంటే ఎలా ఉండాలి? గురువును ఎలా గౌరవించాలి? అని చెప్పే చిత్రమిది’’ అన్నారు సి. కల్యాణ్‌. దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ మాట్లాడుతూ ‘‘తమిళనాడులో ‘బాలకృష్ణకి కోపం ఎక్కువ.

ఆయనతో ఎలా చేయబోతున్నారు’ అన్నారు. నాకు భయంగా ఉండేది. తర్వాత డిస్కషన్లలో, షూటింగులో ఒక్క రోజు, ఒక్క షాట్‌లో కూడా ఆయన దగ్గర నాకు కోపం కనిపించలేదు. నాతో కంపేర్‌ చేస్తే ఆయనకు ఫైవ్‌ పర్సెంట్‌ కోపం కూడా లేదు.

నేను సుమారు 45 సినిమాలు చేశా. ప్రతి హీరో మార్పులు-చేర్పులు చెప్పేవారు. కానీ, ఇద్దరే ఇద్దరు హీరోలు నన్నేమీ అడగలేదు. తమిళంలో అజిత్‌, తెలుగులో బాలకృష్ణగారు.

ఒక్క షాట్‌లో కూడా క్వశ్చన్‌ చేయలేదు. అసిస్టెంట్లు ఇరిటేట్‌ చేస్తే ఆయనకు కోపం వస్తుంది. చాలా మందికి నన్ను ఈ చిత్రానికి సెలక్ట్‌ చేసిందెవరు? యాక్సెప్ట్‌ చేసిందెవరు? అనేది తెలీదు.

ఆ ఇద్దరూ… కల్యాణ్‌, బాలకృష్ణగార్లు. వాళ్లకి థ్యాంక్స్‌. నాకు మంచి ఆర్టిస్టులను, టెక్నీషియన్లు ఇచ్చారు. బోయపాటి శ్రీనుగారు సినిమాకి క్లాప్‌ ఇచ్చారు. ఇప్పుడు ప్లాటినమ్‌ డిస్క్స్‌ ఇచ్చారు. 100 డేస్‌ షీల్డ్‌ కూడా ఆయనే ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.

వీవీ వినాయక్‌ మాట్లాడుతూ ‘‘బాలకృష్ణగారు సెట్‌లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకూ ఒకే రకంగా ట్రీట్‌ చేసే విధానం, అందర్నీ పలకరించే విధానం, ఆయన ఇచ్చే మర్యాద ఎప్పటికీ మర్చిపోలేనిది.

‘నరసింహనాయుడు’ తర్వాత మళ్లీ ఓ బిడ్డ సెంటిమెంట్‌తో బాలకృష్ణగారు చేసిన చిత్రమిది. నేను క్లైమాక్స్‌ విన్నా. ఒక పాట కూడా చూశా. ఆయన ఫ్యాన్స్‌ ఆల్రెడీ సంక్రాంతి హిట్‌ అందుకున్నట్లే’’ అన్నారు.

బోయపాటి శ్రీను మాట్లాడుతూ ‘‘బాలయ్యబాబుగారు గురించి నేను చెప్పడం కన్నా… చేసి చూపిస్తా. ఆయనతో సినిమా చేస్తున్నా. ఏ సినిమా అయినా ఆయన కసిగా నిలబడతాడు, కసితో నిలబెడతాడు. ట్రైలర్‌లో మీరు చూసింది తక్కువ.

థియేటర్లలో చూడబోయేది ఎక్కువ. సినిమాను ప్రేమించి తీసే నిర్మాతలు తెలుగు పరిశ్రమకు అవసరం. అలాంటివారిలో సి. కల్యాణ్‌గారు ఉంటారు’’ అన్నారు.

Leave a comment