Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

చైనా సముద్రంలో నౌకల ఢీ

Published on Jan 08 2018 // News

తూర్పు చైనా సముద్రంలో ఆయిల్‌ ట్యాంకర్‌ నౌక, సరకు రవాణా నౌక ఢీకొన్న ప్రమాదంలో ట్యాంకర్‌కు చెందిన మొత్తం 32 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వీరిలో 30 మంది ఇరాన్‌ దేశస్తులు కాగా ఇద్దరు బంగ్లాదేశీయులు.

ఇరాన్‌ నుంచి 1.36 లక్షల టన్నుల ముడి చమురుతో వెళ్తున్న సాంచీ అనే రవాణా నౌక శనివారం సాయంత్రం షాంఘైకి 160 నాటికల్‌ మైళ్ల దూరంలో చైనాకు చెందిన, 64 వేల టన్నుల ధాన్యంతో అమెరికా నుంచి వస్తున్న సీఎఫ్‌ క్రిస్టల్‌ అనే మరో సరకు రవాణా నౌకను ఢీకొట్టింది. ముడిచమురు కావడంతో వెంటనే మంటలు ఎగిసిపడ్డాయి.

ట్యాంకర్‌కు చెందిన 32 మంది సిబ్బంది గల్లంతవ్వగా, క్రిస్టల్‌ నౌకలోని మొత్తం 21 మందిని సహాయక బృందాలు రక్షించాయి.

ముడి చమురు వ్యాపించడంతో సముద్ర జలాలు కలుషితమయ్యాయని చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయానికి కూడా సాంచి ఇంకా నీటిపై తేలుతూ, మండుతూనే ఉందనీ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పింది.

గల్లంతైన వారిని వెతికేందుకు చైనా సముద్రతీర విభాగం అధికారులు 8 ఓడలను పంపించారు. దక్షిణ కొరియా కూడా ఓ విమానాన్ని, తీర ప్రాంత రక్షణ దళానికి చెందిన ఓ నౌకను పంపించి గాలింపు చర్యలు చేపడుతోంది.

Leave a comment