Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ప్ర‌కాశంలో వైకాపాకు ఝుల‌క్‌..?

Published on Jan 08 2018 // Movie News

పర్చూరు నియోజకవర్గ వైకాపా సమన్వయకర్త గొట్టిపాటి భరత్‌ కూడా బూచేపల్లి బాటలో పయనించనున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉంటారా? అన్న ప్రశ్నలకు జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఔనన్న సమాధానం వస్తోంది.

వైసీపీ నాయకుల్లో జరుగుతున్న చర్చ, జనవరి 1వ తేదీ ఆయన నియోజకవర్గంలో లేకపోవడం, నిన్నటికి నిన్న జిల్లా సమావేశంలో నాయకులకు తన అభిప్రాయాన్ని చెప్పేసి వెళ్లిపోవడం ఇత్యాధి అంశాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

ఒంగోలు : ‘‘మనకు బాస్‌ జగన్‌. ఆయన్నే అనుసరిస్తామ‌ని ప్రకటిస్తూనే పోటీపై ఆయన స్పష్టత ఇవ్వడం లేదు. అదేసమయంలో భరత్‌ కాదంటే నేను పోటీకి రెడీ అంటూ భరత్‌ తండ్రి నరసయ్యకు సన్నిహితుడైన రాంబాబు అనే వ్యాపారవేత్త నాయకుల చుట్టూ తిరుగుతుండటం కూడా అనుమానాలను పెంచింది.

ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి కుటుంబం నిర్ణయించుకోవడం వైకాపాకి ఇబ్బందికరంగా మారగా, ఇప్పుడు భరత్‌ మరోషాక్‌ ఇచ్చారు.

మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య కుమారుడైన భరత్‌ తండ్రి మరణానంతరం ప్రత్యక్ష రాజకీయ రంగప్రవేశం చేశారు. జగన్‌ ప్రోత్సాహంతో గత ఎన్నికల్లో పర్చూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. సుమారు 12వేల ఓట్ల తేడాతో ఆయన ఓటమి చెందారు.

ఆ తర్వాత ఆయన ఆ పార్టీలో చురుగ్గానే పని చేశారు. జిల్లాలో జగన్‌కు సన్నిహితంగా ఉండే నాయకుల్లో ఒకరిగా మెలిగారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ యువజన విభాగ అధ్యక్ష పదవిని కూడా భరత్‌‌కు ఇచ్చి జగన్‌ గౌరవించారు.

నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ, ప్రజా సమస్యలపై స్పందించడంలోనూ చురుగ్గా వ్యవహరించారు. ఒకానొక సందర్భంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిందని ఆందోళన చేసి జైలుకు కూడా వెళ్లారు.

అలాంటిది ఆరేడు నెలలుగా ఆయన పనితీరులో వేగం తగ్గింది. కొద్దిరోజులుగా ఆయన రాజకీయ భవితవ్యంపై వివిధ రకాల ప్రచారం జరుగుతోంది.

రాజకీయ కార్యక్రమాలను ఆయన తగ్గించడం కూడా ఇందుకు కారణమైంది. అయితే ఆర్థిక సమస్యల్లో ఉన్నందునే ఆచితూచి వ్యవహరిస్తున్నారని భావించారు.

ఈ నేపథ్యంలో ఆయన జనవరి 1న కూడా కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడంతో అందరి దృష్టి ఆవైపునకు మళ్లింది. దీంతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని పార్టీ అధినేత జగన్‌కు ఆయన చెప్పారన్న విషయం బయటకు వచ్చింది.

విశ్వసనీయ సమాచారం మేరకు కొద్దిరోజుల క్రితం పాదయాత్రలో ఉన్న జగన్‌ను భరత్‌ కలిసి తనకు ఉన్న ఆర్థిక సమస్యల దృష్ట్యా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనన్న భావనను వ్యక్తం చేయడంతోపాటు, చివరి క్షణంలో తన నిర్ణయాన్ని చెప్తే పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతో ముందుగా తమ దృష్టికి తెస్తున్నానని జగన్‌తో ఆయన అన్నట్లు తెలిసింది.

ఆ తర్వాత వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు చోటుచేసుకున్నవి తెలియనప్పటికీ జనవరి 1న భరత్‌ నియోజకవర్గంలో లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆయన రాజకీయ పోకడపై అనుమానాలు పెరిగాయి.

అయితే బుధవారం రాత్రికి ఇంటికి వచ్చిన భరత్‌ గురువారం తన వద్దకు వచ్చిన నాయకులు, అనుచరులను కలిసి మధ్యాహ్నం నుంచి ఒంగోలులో పార్టీ సమావేశానికి హాజరయ్యారు.

ఆయన బాలినేని, సజ్జలను విడిగా కలిసిన సందర్భంలో తనకున్న ఆర్థిక సమస్యను వివరించి వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండబోతున్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది.

వెంటనే వారు జగన్‌ ద్వారా తమకు సమాచారం వచ్చిందని అన్నట్లు తెలిసింది. వారితో మాట్లాడిన అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన భరత్‌ నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల్లో కొద్ది మందితో మాట్లాడినట్లు తెలిసింది. దీంతో భరత్‌ రాజకీయ పోకడ చర్చనీయాంశంగా మారింది.

రంగంలోకి రాంబాబు
ఇదేసమయంలో పర్చూరు మండలం అడుసుమల్లి గ్రామానికి చెందిన రాంబాబు అనే నాయకుడు పార్టీ తరఫున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అవకాశం ఇవ్వాలని నేతల చుట్టూ తిరుగుతున్నారు.

బళ్లారి ప్రాంతంలో వ్యవసాయం, వ్యాపారం చేస్తున్న ఆయన చాలా కాలం నుంచి భరత్‌ తండ్రి గొట్టిపాటి నరసయ్యకు అనుచరుడిగా ఉన్నారు.

తదనుగునంగా నరసయ్య వారసుడైన భరత్‌కు గత ఎన్నికల్లో మద్దతునిచ్చాడు. ఆకస్మికంగా వైసీపీకి తాను పోటీ అంటూ తిరగడం ఆ పార్టీ శ్రేణులను ఆశ్చర్యనికి గురి చేస్తోంది.

పార్టీ పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి తదితరులను ఆయన కలిసి తన ఆర్థిక పరిస్థితిని వివరించి ఎన్నికల్లో ఎంత మేర వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నది తెలియజేసి పర్చూరు నియోజకవర్గ పార్టీ బాధ్యతలు అప్పగించాలని కోరినట్లు తెలిసింది. అంతేకాకుండా తాను పార్టీ టిక్కెట్‌ను ఆశిస్తున్న విషయాన్ని రాంబాబు బహిరంగానే వెల్లడించారు.

పైపెచ్చు భరత్‌ పోటీకి సిద్ధంగా లేరన్న సమాచారంతోనే తాను వైసీపీ టిక్కెట్‌ను ఆశిస్తున్నట్లు ఆయన చెప్తున్నారంటున్నారు. ఏది ఏమైనా రాంబాబు రంగంలోకి రావడం ద్వారా భరత్‌ పోటీకి దూరంగా ఉంటారన్న ప్రచారానికి బలం చేకూరుస్తోంది.

జగన్‌ను కలవనున్న కుటుంబసభ్యులు
ఈ మొత్తం వ్యవహారం నేపథ్యంలో జగన్‌ను భరత్‌ కుటుంబ సభ్యులు కలవబోతున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు భరత్‌ తల్లి, సోదరి చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసేందుకు వెళ్లారని కూడా అంటున్నారు.

భరత్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేనని ఇచ్చిన సమాచారం మేరకు వీరితో మాట్లాడేందుకు జగన్‌ కలవాలని సమాచారం పంపారని కొందరంటున్నారు.

జగన్‌తో భరత్‌ సమావేశమై చెప్పిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు వారు వెళ్లారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

జగన్‌ పిలిచారా లేక వీరే వెళ్లారా? అన్న విషయాన్ని పక్కనపెడితే వారు ఆయన్ను కలిస్తే మాత్రం పార్టీ పరంగా భరత్‌ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో భరత్‌ పార్టీ మారే అవకాశాలు కూడా లేకపోలేదన్న ప్రచారం కూడా ఊపందుకుంది.

జగనే నాకు ప్రాణం
ఈ నేపథ్యంలో భరత్‌ తనను కలిసిన అనుచరులను, నియోజకవర్గంలోని కొందరు పార్టీ నాయకులతో ‘నాకు జగన్‌ అంటే ప్రాణం. మన పయనం ఎప్పుడూ ఆయనేతోనే’ అని చెప్తున్నట్లు తెలిసింది.

అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ విషయమై వస్తున్న అనుమానాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదని ఆయనను కలిసిన కొందరు నాయకులు తెలిపారు. దీంతో భరత్‌ తన రాజకీయ భవితవ్యంపై మున్ముందు ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న అంశం కీలకంగా మారింది.

Leave a comment