Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

రోడ్డు ప్ర‌మాదంలో జూనియ‌ర్ ఆర్టీస్ట్‌

Published on Jan 08 2018 // News

స్నేహితులు ఇచ్చిన పార్టీలో పీకలదాకా మద్యం తాగిన వ్యక్తి అర్ధరాత్రి కారును తీసుకొని రోడ్డు మీదికొచ్చాడు. ఎలా నడుపుతున్నాడో ఎటు వెళ్తున్నాడో తెలియనంతంగా మత్తులో కారును వేగంగా పోనిచ్చాడు.

అలా అడ్డగోలుగా డ్రైవ్‌ చేస్తూ ఎదురుగా వెళుతున్న స్కూటీని బలంగా ఢీ కొట్టాడు. మృత్యుశకటంలా దూసుకొచ్చిన కారు తాకిడికి ఆ స్కూటీపై వెళుతున్న ముగ్గురు యువతులు తలో దిక్కు ఎగిరిపడ్డారు.

తలకు బలమైన గాయమై, తీవ్ర రక్తస్రావం కావడంతో ఒక యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగతా ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. వారిలో ఒకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

ఈ విధంగా తప్పతాగి వాహనం నడిపిన ఒక్కడి నిర్లక్ష్యం మూడు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది! హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో శనివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిందితుడిని పంజగుట్టకు చెందిన విష్ణువర్దన్‌గా గుర్తించారు.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెంకు చెందిన మస్తానీ జూనియర్‌ ఆర్టిస్టు. పలు సినిమాల్లో నటించినట్టు సమాచారం. శ్రీనగర్‌కాలనీలో స్నేహితురాళ్లు వైజాగ్‌కు చెందిన అనూషా రెడ్డి, ప్రియతో కలిసి ఉంటోంది.

రెండు రోజుల క్రితం మస్తానీ కూకట్‌పల్లిలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. శనివారం రాత్రి ప్రియ, అనూషారెడ్డి స్కూటీ మీద కూకట్‌పల్లికి వెళ్లారు.

అదేరోజు అర్ధరాత్రి ముగ్గురు కలిసి శ్రీనగర్‌ కాలనీకి వచ్చేందుకు స్కూటీ మీద జేఎన్‌టీయూ, మాదాపూర్‌ మీదుగా బయలు దేరారు. అనూష వాహనాన్ని నడుపుతుండగా.. మధ్యలో మస్తానీ, వెనుక ప్రియ కూర్చున్నారు.

పది నిమిషాల్లో చేరుకుంటారనగా..
మరో పదినిమిషాల్లో ముగ్గురు గమ్యస్థలానికి చేరుకుంటారనగా ఘోరం జరిగిపోయింది. అర్ధరాత్రి 1:30 గంటలకు జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10 డైమండ్‌ హౌస్‌ ప్రాంతంలో వీరు వెళుతున్న స్కూటీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. తర్వాత అదే వేగంతో దూసుకెళ్లి డివైడర్‌ను ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో మస్తానీ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందింది. అనూష, ప్రియలకు తీవ్ర గాయాలయ్యాయి. అనూష కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. స్థానికులు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు. అనూష పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. కాగా ప్రమాదానికి కారణమైన విష్ణువర్దన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హిమాయత్‌నగర్‌లో ఓ ప్లే స్కూల్‌ నిర్వహిస్తున్నాడు.

మాదాపూర్‌లో స్నేహితులు ఇచ్చిన పార్టీకి హాజరై ఆ మత్తులో కారు నడిపిన్నట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష చేయగా 206 బ్లడ్‌ ఆల్కాహాల్‌ కంటెంట్‌ ఉన్నట్టు తేలింది.

పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు మస్తానీ, గాయపడిన అనూష, ప్రియలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment