Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

వారం లో ఉత్త‌ర‌,ద‌క్షిణ కోరియాల చర్చలు

Published on Jan 07 2018 // National

వచ్చేవారం ఉత్తర, దక్షిణకొరియా దేశాల మధ్య చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు దక్షిణకొరియా ప్రతిపాదనను ఉత్తరకొరియా శుక్రవారం అంగీకరించింది. శీతాకాల ఒలింపిక్స్ క్రీడలు ముగిసే వరకు సంయుక్త సైనిక విన్యాసాలను వాయిదా వేయాలని అమెరికా, దక్షిణకొరియా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే ఉత్తరకొరియా సానుకూలంగా స్పందించింది.

2015 డిసెంబర్ తర్వాత ఉభయ కొరియాల మధ్య తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. ఇరుదేశాల సరిహద్దుల్లోని సైనిక రహిత గ్రామమైన పాన్‌మూన్‌జొమ్‌లో చర్చలు జరుగనున్నాయి. గత ఏడాది ఉత్తరకొరియా పలు ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేపట్టడంతో ప్రాంతీయంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.

అదేసమయంలో దక్షిణకొరియాలో జరుగనున్న ఒలింపిక్స్ క్రీడలకు తమ బృందాన్ని పంపుతామని ఉత్తరకొరియా ప్రకటించడంతో ఉభయ దేశాల మధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వచ్చేవారం చర్చలకు రావాలని దక్షిణకొరియా ఉత్తరకరియాను ఆహ్వానించింది.

సొంత పట్టణాన్ని ఢీకొట్టిన ఉత్తరకొరియా క్షిపణి!
ఉత్తరకొరియా గతేడాది ప్రయోగించిన ఓ మధ్య శ్రేణి క్షిపణి అదే దేశంలోని ఓ పట్టణంపై పడినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గత ఏడాది ఏప్రిల్ 28వ తేదీన మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి (ఐఆర్‌బీఎం) హ్వాసంగ్-12ను ఉత్తరకొరియా ప్రయోగించింది. ప్రయోగం విఫలమై ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు 90 మైళ్ల దూరంలో ఉన్న టోక్చోన్ పట్టణంలో ఆ క్షిపణి పడినట్టు అమెరికా అధికారవర్గాలు భావిస్తున్నాయి.

Leave a comment