Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

అమెరికా, కెనడాలను వణికిస్తున్న మంచుతుఫాన్

Published on Jan 07 2018 // National

అమెరికాలో బీభత్సం సృష్టిస్తున్న మం చు తుఫాన్ (బాంబ్ సైక్లోన్) క్రమంగా కెనడాకూ విస్తరించింది. ఉష్ణోగ్రతలు బాగా పడిపోవడంతో రహదారులన్నీ గడ్డకట్టుకుపోయాయి.

దీనికితోడు ప్రమాదకరంగా మంచుతో కూడిన గాలులు వీ స్తుండడంతో జీనజీవనం పూర్తిగా స్తంభించింది. దీంతో ఇప్పటివరకు అమెరికాలో 18మంది, కెనడాలో ఇద్దరు మృతిచెందారు. రోడ్లపై పేరుకుపోయిన మంచుతో కార్లు బోల్తాపడి నలుగురు ప్రాణాలు కోల్పోగా, మిగతా వారు అనారోగ్యంతో మరణించారు.

పలు రాష్ర్టాల్లో ఇప్పటికే అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. శుక్రవారం మిన్నెసోటాలో మైనస్ 41, న్యూ ఇంగ్లండ్‌లోని కరీబో, ఉత్తర మియానె ప్రాంతాల్లో మైనస్ 40, దక్షిణ డకోటాలో మైనస్ 36 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణ్రోగతలు నమోదయ్యాయి.

న్యూహాంప్‌షైర్‌లోని మౌంట్ వాషింగ్టన్ సమిట్ పర్వతంపై ఉష్ణోగ్రతలు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పతనమయ్యాయని అధికారులు తెలిపారు. న్యూయార్క్‌లోని టైమ్స్‌స్కేర్‌లోనూ మైనస్ 13 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గత రెండురోజుల్లో అమెరికాలో ఏడువేలకు పైగా విమానసర్వీసులను రద్దు చేశారు.

కెనడా తీరం వెంబడి బోటు సేవల్ని నిలిపివేశారు. ఫ్లోరిడా నుంచి మియానె వరకు తూర్పుతీరం వెంబడి విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. సుమారు లక్షమంది రెండురోజులుగా అంధకారంలోనే ఉన్నారు. కాగా, గడ్డకట్టిన నయాగరా జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.

కెనడానూ కుదిపేస్తూ మంచుతుఫాన్ కెనడాలోని పలు ప్రాంతాలను తాకింది. హాలిఫాక్స్ నుంచి అట్టావా వరకు గంటకు 105 కి.మీ.వేగంతో మంచుగాలులు వీస్తున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. టొరంటోలో మైనస్ 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైందని, వచ్చే రెండురోజుల్లో అది మైనస్ 31 డిగ్రీలకు పడిపోవచ్చని హెచ్చరించింది.

బాంబ్ సైక్లోన్ బాధిత ప్రాంతాలవాసులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని టొరంటో మేయర్ జాన్ టోరీ కోరారు.

హ్యూరన్ సరస్సు తీరాన ఉన్న బ్లూవాటర్ పట్టణంలో వృద్ధజంట చనిపోయింది. మంచుతుఫాన్ కారణంగా పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నోవాస్కోటియాలో 11,400మంది అంధకారంలోనే ఉన్నారు.

Leave a comment