Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

అమెరికా అధ్య‌క్ష బ‌రిలోకి నిక్కీ హేలీ

Published on Jan 07 2018 // NRI

ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా విధులు నిర్వహిస్తున్న నిక్కీ హేలీ 2020లో ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడాలని ఆసక్తిగా ఉన్నారని మైఖైల్ ఊల్ఫ్ రాసిన ఫైర్ అండ్ ఫ్యూరీ

ఇన్‌సైడ్ ది ట్రంప్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ఆమెను తన రాజకీయ వారసురాలని ట్రంప్ కూడా పరిగణిస్తున్నట్లు వుల్ఫ్ తెలిపారు.

ట్రంప్ కంటే నిక్కీ హేలీ మెరుగైన అభ్యర్థిగా ఉంటారని దేశాధ్యక్షుడి సన్నిహితుల మధ్య చర్చ జరిగిందని కూడా గుర్తు చేశారు. సౌత్ కరోలినా గవర్నర్‌గా పని చేసిన తొలి మహిళ నిక్కీ హేలీ భారతసంతతి వారు. అయితే ఆమె 2016 ఎన్నికల్లో ఫ్లోరిడా సెనెటర్ మార్కో రూబియో అభ్యర్థిత్వానికి తొలుత మద్దతు పలికారు.

కానీ రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారు కాగానే ఆయనకు గట్టి మద్దతు దారుగా మారిపోయారు. ట్రంప్ కుమార్తె ఇవాంకతో స్నేహ పూర్వకంగా ఉండే నిక్కీ హేలీ.. ఆ కుటుంబంతో అనుబంధం పెంచుకున్నారు.

నిక్కీ హేలీని తొలుత విదేశాంగశాఖ మంత్రిగా నియమించాలని ట్రంప్ భావించినా చివరకు ఐరాసలో అమెరికా రాయబారిగా నియమించారని ఊల్ఫ్ వివరించారు. డొనాల్డ్ ట్రంప్ తన మాజీ సలహాదారు స్టీవ్ బాన్నోన్ వ్యతిరేకత వల్లే నిక్కీ హేలీని విదేశాంగశాఖ మంత్రిగా నియమించలేదని తెలిపారు.

Leave a comment