Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

జ‌య మృతిపై విచార‌ణ వేగ‌వంతం

Published on Jan 04 2018 // Politics

ఎంబ్లామింగ్‌లో భాగంగానే జయలలిత ఎడమ దవడపై రంధ్రాలు చేసినట్టు మద్రాస్ మెడికల్ కాలేజీ (ఎంఎంసీ) అనాటమీ విభాగం చీఫ్ డాక్టర్ సుధా శేషయ్యన్ విచారణ కమిటీకి తెలిపారు.

జయలలిత మృతిపై ఏర్పాటైన జస్టిస్ అర్ముగస్వామి కమిటీ ఎదుట హాజరై సాక్ష్యం చెప్పారు. జయకు అత్యంత సన్నిహితురాలైన ఆమెకు జయ మరణించిన రోజు రాత్రి పది గంటలకు ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చింది.

ప్రజలు సందర్శించే వరకు మృతదేహం చెడిపోకుండా, దుర్వాసన రాకుండా ఎంబ్లామింగ్ చేయడానికి తనను రమ్మన్నారని ఆమె పేర్కొన్నారు.

తన వైద్య బృందంతో ఆసుపత్రికి చేరుకుని మృతదేహంలోకి రసాయనాలు ఎక్కించేందుకు జయ ఎడమ దవడపై నాలుగు రంధ్రాలు చేసినట్టు వివరించారు. మెథనాల్ సహా వివిధ రసాయనాలు కలిగిన ఐదున్నర లీటర్ల మిశ్రమాన్ని జయ శరీరంలోకి ఇంజెక్షన్ల ద్వారా ఎక్కించినట్టు తెలిపారు.

తీవ్ర అస్వస్థతకు గురైన జయలలిత చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. 75 రోజుల చికిత్స తర్వాత డిసెంబరు 5, 2016న తుదిశ్వాస విడిచారు.

ఆమె మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి అర్ముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైంది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన కమిటీ విచారణను వేగవంతం చేసింది.

Leave a comment