Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

అఖిల్ హలో సినిమా స‌మీక్ష‌

Published on Jan 03 2018 // Movie News

అఖిల్ సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన విష‌యం తెలిసిందే .. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అతడికి నిరాశనే మిగిల్చింది. దాంతో తనయుడు అఖిల్ కెరీర్‌ను నిలబెట్టడంతో పాటు అతడికో మంచి హిట్టు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు నాగార్జున.

మనం రూపంలో తన కుటుంబానికి, సంస్థకు మరుపురాని సినిమాను అందించిన విక్రమ్.కె.కుమార్ ఆ బాధ్యతను అప్పగించారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా స్వచ్ఛమైన ప్రేమకథను ఎంచుకొని హలో సినిమాను నిర్మించారు.

వినూత్న కథాంశాలతో సినిమాలు చేస్తాడనే పేరున్న దర్శకుడు విక్రమ్.కె.కుమార్ ఈ సినిమాను ఎలా తెరకెక్కించారు? ఆఖిల్‌కు ఈసినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? ఈ సినిమాతో అతడు విజయాల ఖాతా తెరిచాడా?లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే…

హైదరాబాద్‌లోని ఇంద్రావతి అనే పార్కులో కథ మొదలవుతుంది. శీను( అఖిల్) ఓ అనాథ. అమ్మనాన్నలు లేని అతడికి ఆ పార్కే ఆశ్రయం కల్పిస్తుంది. సంగీతం తప్ప మరో ప్రపంచమేది అతడికి తెలియదు. అలాంటి శ్రీను జీవితం జున్ను పరిచయంతో కొత్త మలుపు తిరుగుతుంది.

కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులు అవుతారు. జున్ను(కళ్యాణి) తండ్రికి వేరే ప్రాంతానికి బదిలీ కావడంలో ఇద్దరు విడిపోతారు. సంపన్నకుటుంబానికి చెందిన ప్రకాష్, సరోజిని(జగపతిబాబు, రమ్యకృష్ణ) దంపతులు శీనును దత్తత తీసుకుంటారు.

అతడి పేరును అవినాష్‌గా మారుస్తారు. జున్ను తనకు దూరమై పధ్నాలుగేళ్లు గడిచినా ఆమెను మాత్రం మరచిపోలేకపోతాడు శీను. నిరంతరం ఆమె జ్ఞాపకాలతో జీవిస్తుంటాడు. మరోవైపు జున్ను కూడా శీనును ప్రేమిస్తుంటుంది. వారిద్దరు ఏవిధంగా కలుసుకున్నారు? అందుకు దారి తీసిన పరిస్థితులేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం.

చిన్ననాటి ఆత్మబంధువును అన్వేషిస్తూ ప్రయాణం సాగించే ఓ జంట కథ ఇది. విధి కారణంగా విడిపోయినా వారు మళ్లీ ఎలా ఏకమయ్యారనే అంశాన్ని తెరపై హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించారు దర్శకుడు.

శీను, జున్ను విడిపోయే సన్నివేశాలు, వారిద్దరి కలవకుండా అడ్డుపడే పరిస్థితులు ఆసక్తిని రేకెత్తిస్తాయి.కథల కంటే కథనానికే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ సినిమాల్ని రూపొందిస్తుంటారు దర్శకుడు విక్రమ్.కె.కుమార్. మరోమారు అదే పంథాను అనుసరించారు.

సున్నితమైన ప్రేమకథను తనదైన శైలి స్క్రీన్‌ప్లేతో ఆహ్లాదభరితంగా నడిపించారు. ప్రేమకథకు కుటుంబ బంధాలను జోడించిన విధానం బాగుంది.

ఉత్కంఠను రేకెత్తించే మలుపులు, భారీ పోరాట ఘట్టాలు, కామెడీ ట్రాక్‌లు, ప్రత్యేక గీతాల లాంటి కమర్షియల్ హంగులేవి సినిమాలో కనిపించవు. నవ్యతరహాలో సాగే పోరాట ఘట్టాలు కొత్త అనుభూతిని పంచుతాయి.

తొలి సినిమాతో పోలిస్తే అఖిల్ నటనలో పరిణితి కనిపించింది. ప్రియురాలు దూరమై సంఘర్షణకు లోనయ్యే ప్రేమికుడి పాత్రలో ఒదిగిపోయారు. కథానాయికగా కళ్యాణికి ఇదే తొలి సినిమానైనా ఎక్కడ ఆ భావన కలగకుండా అభినయంతో ఆకట్టుకుంది.

అఖిల్, కల్యాణి జంట బాగుండడం సినిమాకు కలిసివచ్చింది. జగపతిబాబు, రమ్యకృష్ణ పాత్రలు సహజంగా సాగుతాయి. కొడుకు కోసం తపించే తల్లిదండ్రులుగా భావోద్వేగ ప్రధానంగా సాగే వారి పాత్రలతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతారు. హీరోహీరోయిన్ల చిన్ననాటి పాత్రల్లో కనిపించిన బాల నటులు తమ అభినయంతో మెప్పించారు.
సింపుల్ కథకు పి.ఎస్ వినోద్ ఛాయాగ్రహణం, అనూప్ రూబెన్స్ సంగీతం ప్రాణంపోశాయి. అనూప్ స్వరపరచిన ప్రతి పాట సందర్భానుసారంగా సాగుతూ వినసొంపుగా ఉంటాయి. కథ, దర్శకుడు విక్రమ్.కె. కుమార్ ప్రతిభపై ఉన్న నమ్మకంతో ఎక్కడ రాజీపడకుండా అత్యున్నత నిర్మాణ విలువలతో నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.

లాజిక్‌లను పక్కనపెట్టి చూస్తే ఫీల్‌గుడ్ ఎంటర్‌టైనర్‌గా హలో తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుంది. కథానాయకుడిగా అఖిల్‌కు చక్కటి శుభారంభాన్ని ఇచ్చే సినిమా ఇది. మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్ని అలరించే హంగులు ఈ సినిమాలో ఎక్కువగా ఉన్నాయి. కొత్తదనంతో కూడిన కథాంశాల్ని ఇష్టపడే వారిని ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

Leave a comment