Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

అమెరికాపై సయీద్‌ హఫీజ్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Jan 02 2018 // NRI

పాకిస్థాన్‌కు చెందిన అంతర్జాతీయ ఉగ్రవాది సయీద్‌ హఫీజ్‌ అగ్రరాజ్యం అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఆ దేశంపై జిహాద్‌(పవిత్ర యుద్ధం) ప్రకటిస్తున్నట్లు బహిరంగంగా వెల్లడించాడు.
పాకిస్థాన్‌కు గత 15ఏళ్లలో రూ.2.10లక్షల కోట్లు(33బిలియన్‌ డాలర్లు)కు పైగా ఆర్థిక సాయం అందించాం. దీనివల్ల ఒరిగింది ఏమీ లేదు. అక్కడి నాయకులు అబద్ధాలు చెబుతూ, నమ్మక ద్రోహం చేశారు.’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో సయీద్‌ హఫీజ్‌ అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేయటంతో పాటు పాకిస్థాన్‌ అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. పాకిస్థాన్‌పై ట్రంప్‌ త్రీవ ఆరోపణలు చేసిన రోజే హఫీజ్‌ కూడా స్పందించటం గమనార్హం.

26/11 ముంబయి ఉగ్రదాడి ఘటనకు ప్రధాన సూత్రధారి అయిన హఫీజ్‌ అమెరికా, ఇజ్రాయిల్‌పై జిహాద్‌ ప్రకటిస్తూ లాహోర్‌లో ర్యాలీ చేపట్టాడు. ఈ ర్యాలీలో హఫీజ్‌తో పాటు, జమాత్‌-ఉద్‌-దవా నేత అబ్దుల్‌ రెహమాన్‌ మఖ్కీ కూడా పాల్గొన్నాడు.

ఇజ్రాయిల్‌ రాజధానిగా జెరూసలెంను అమెరికా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీని చేపట్టడం గమనార్హం. అయితే దీని వెనుక ప్రధాన ఉద్దేశం మాత్రం కొత్త సంవత్సరం రోజున ట్రంప్‌‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే అని తెలుస్తోంది.

తన ప్రసంగాల ద్వారా యువతను ప్రభావితం చేసే హఫీజ్‌ను పాకిస్థాన్‌ వెనుకేసుకొస్తోంది. అంతేకాదు అతడిని అరెస్టు చేయడంలోనూ జాప్యం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘పాకిస్థాన్‌ అణ్వాయుధం ఇస్లాం ఆస్తి. జెరూసలెం విషయంలో దీన్ని ఉచితంగా వినియోగించవచ్చు.

ఇది నా బహిరంగ ప్రకటన. ఇస్లామిక్‌ దేశాల చీఫ్‌లతో సదస్సు ఏర్పాటు చేసి జిహాద్‌ ప్రకటిస్తున్నాం. ఐసిస్‌ ప్రభావం తగ్గిపోతూ ఉంది. పవిత్ర యుద్ధం అంతానికి అమెరికా కుట్రలు చేస్తోంది’ అని సయీద్‌ తీవ్రంగా వ్యాఖ్యానించాడు.

సయీద్‌పై పాకిస్థాన్‌ మోపిన అభియోగాలు కోర్టులో రుజువుకాకపోవడంతో ఇటీవల అతను విడుదలై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

మిల్లి ముస్లిం లీగ్‌(ఎంఎంఎల్‌) పేరుతో పార్టీని స్థాపించి 2018లో పాకిస్థాన్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం అమెరికా నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాడు.
ఈ సందర్భంగా జామాత్‌-ఉద్‌‌-దవా నేత అబ్దుల్‌ రెహమాన్‌ మాట్లాడుతూ.. హిందూ, క్రిస్టియానిటీపై పోరాటం చేసేందుకు అల్లా పూర్తి శక్తినిస్తాడని ఆశిస్తున్నా’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

బిల్లు పట్ల నాస్‌కామ్‌ ఆందోళన వ్యక్తంచేస్తోంది.

ఈ విషయమై అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌ సభ్యులు, అధికారులతో తమ ఆందోళనలను వెలిబుచ్చామని, త్వరలో మరోసారి హెచ్‌-1బీ వీసా సంబంధిత సమస్యలపై చర్చిస్తామని నాస్‌కామ్‌ అధ్యక్షుడు ఆర్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు.

Leave a comment