Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

2019 ఎన్నికలకై ప‌క్క‌ ప్ర‌ణాళిక‌తో బీజేపీ ..?

Published on Dec 28 2017 // Politics

2019 ఎన్నిక‌ల కోసం ఏపీలో బీజేపీ ప‌క్క ప్ర‌ణాళిక‌తో ముందుకు వెలుతున్నారు.. కమలనాధులు మాత్రం సెంటిమెంట్‌ను పదేపదే ఉపయోగించాలనుకొంటున్నారు. అదే తమను గెలుపు తీరాల్లోకి చేరుస్తుందని భావిస్తున్నారు.

అందుకనే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ గెలుపునకు దోహదం చేసిన మోటార్ సైకిళ్లను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించారు.

ఏపీలో కూడా తమ గెలుపునకు ఆ మోటారు సైకిళ్లు బాట వేస్తాయని భావిస్తున్నారు. ఆ మోటారు సైకిళ్ల గోల ఏమిటో ఈ కథనంలో తెలుసుకోండి.

దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ను కైవసం చేసుకున్న భారతీయ జనతాపార్టీ ఆ సక్సెస్‌ ఫార్ములాను ఇతర రాష్ట్రాలలో కూడా అమలు జరపాలని ఉవ్విళూరుతోంది. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలకు సంవత్సరం ముందునుంచే కమలనాథులు గ్రామాలకు వెళ్లారు.

వీరికి తోడు ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్‌.బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ సంస్థలు కలిసి పనిచేశాయి. మందిరం-మసీదు వివాదం కారణంగా బీజేపీకి ఆ రాష్ట్రంలో ఎంతో కొంత బలముంది. అందుకే బూత్‌ల వారీగా వెళ్లి బీజేపీ అనుబంధ సంస్థలు కలిసి పనిచేశాయి.

అప్పటికే అక్కడ ఉన్న అఖిలేశ్‌యాదవ్‌ కుటుంబంలో వచ్చిన విభేదాలు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బీజేపీకి కలిసివచ్చాయి.

ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లో వివిధ నియోజకవర్గాలలో పనిచేసేందుకు బీజేపీ ఫుల్‌ టైమర్లను నియమించింది. వారికి మోటార్‌సైకిళ్లను కొనిచ్చింది.. అన్ని గ్రామాల్లోనూ తిరగాలని.

అక్కడ బూత్‌ కమిటీలతో కలిసి పని చేయాలని కోరింది.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎన్నికలు సమీపిస్తున్నాయి.. మరో 16 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి.. అంటే 2018 జనవరి నుంచి దాదాపుగా ఎన్నికల సంవత్సరంలో అడుగు పెడుతున్నట్టుగానే భావించాలి.

అందుకనే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో తమను విజయతీరాలకు చేర్చిన 175 మోటారుసైకిళ్లను ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయానికి వీటన్నింటినీ తరలించారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో ఫుల్‌ టైమర్లను నియమించి.. వారికి నెలకు పది వేల రూపాయల వేతనం.

పార్టీ నేతల గృహాల్లోనే అద్దెకు గది. భోజనవసతి ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 30 మంది ఫుల్‌ టైమర్లను ఇప్పటికే నియోజకవర్గాలకు పంపారు. వారందరికీ మోటారు సైకిళ్లు ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చిన బైకులకు ఏపీలో రిజిస్ర్టేషన్‌లు చేయించి మరీ ఇస్తున్నారు. వీటిపై కమలం గుర్తు వేసి పంపుతున్నారు.

ఈ ఫుల్‌టైమర్లు ఎన్నికల వరకు పని చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గ నేతలకు సంబంధం లేకుండా నేరుగా వారు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం పర్యవేక్షణలో పని చేస్తుంటారు.

ప్రతి రోజు ఒక గ్రామం లేదా పట్టణాలలో ఒక వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న బీజేపీ నేతలతో కలిసి పనిచేస్తారు.. నగరాలలో అయితే ఒక డివిజన్‌కు వెళతారు. బూత్‌ కమిటీలను నియమిస్తారు. నిత్యం టచ్‌లో ఉంటారు.

ఇంతవరకూ బాగానే ఉంది. ఏపీలో కమలనాథులకు తెలుగుదేశంపార్టీతో మైత్రి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా అంత పటిష్టత లేదు.

అలాంటి తరుణంలో గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది.. వచ్చే ఎన్నికలలో తమ బలాన్ని చూపించి సీట్లు అడగాలని బీజేపీ భావిస్తోంది.

అయితే బూత్‌ కమిటీలు వేసి.. ఉత్తరప్రదేశ్‌ మోటార్‌సైకిళ్లపై ఆంధ్రప్రదేశ్‌లో తిరిగినంత మాత్రాన ఏపీలో బలపడతారా అనేది ఏపీ రాజకీయాలు తెలిసిన వారికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది.

విభజన తర్వాత ఏపీకి కేంద్రం సరైన సాయం అందించడం లేదని ఇప్పటికే రాష్ర్ట ప్రజలలో బీజేపీపై అసంతృప్తి గూడుకట్టుకుంది. అలాంటి తరుణంలో బీజేపీ సంస్థాగతంగా బలపడటం అటుంచి.

తెలుగుదేశం-బీజేపీ పొత్తుపై కూడా ఏపీ ప్రజలలో సందేహాలు నెలకొంటున్నాయి. నరేంద్రమోదీ పట్ల ఉన్న క్రేజు కూడా పెద్దనోట్ల రద్దు.. జీఎస్‌టీ అమలు తర్వాత క్రమంగా సన్నగిల్లుతోంది. ఇలాంటి సమయంలో ఉత్తరప్రదేశ్‌ మోటారు సైకిల్‌ సెంటిమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు నమ్ముకుంటున్నారు. కమలం వికసిస్తుందో లేదో చూడాలి.

Leave a comment