Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

పార్లమెంట్‌లో.. గంద‌ర‌గోళం..

Published on Dec 27 2017 // Politics

పార్లమెంట్‌ ఉభయ సభల్లో బుధవారం గందరగోళం నెలకొంది. కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్దే వ్యాఖ్యలు, కుల్‌భూషణ్‌ జాదవ్‌ ఘటనల నేపథ్యంలో ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో సభ రెండుసార్లు వాయిదా పడింది.

ఈ ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే అనంత్‌కుమార్‌ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. హెగ్దేను మంత్రివర్గం నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

వెల్‌లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేసింది. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే విషయమై గందరగోళం నెలకొనడంతో సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ 12 గంటలకు సభ ప్రారంభమైంది.

కుల్‌భూషణ్‌ జాదవ్‌, అతడి కుటుంబసభ్యులతో భేటీపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్వాస్మరాజ్‌ ప్రకటన చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే మరోసారి ప్రతిపక్షాలు నిరసన చేపట్టాయి. జాదవ్‌ కుటుంబసభ్యుల పట్ల పాకిస్థాన్‌ ప్రభుత్వం ప్రదర్శించిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.

జాదవ్‌ను వెంటనే భారత్‌కు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు మిగతా ప్రతిపక్ష నేతలు కూడా మద్దతు పలికారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య సభ మరోసారి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జాదవ్‌ విషయంపై గురువారం తాను ప్రకటన చేస్తానని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ తెలిపారు.

Leave a comment