Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

అమెరికావాసులను హడలెత్తించిన తెల్లని కాంతి

Published on Dec 26 2017 // NRI

సాసర్ ఆకారంలో ఉండే వారి అంతరిక్ష నౌక (యూఎఫ్‌వో)లో అమెరికాలో దిగారు. ఆ ఏలియన్స్ నౌక ఉత్తర కొరియా మీదుగా అమెరికాకు వచ్చింది.

శుక్రవారం సాయంత్రం అమెరికాలోని కాలిఫోర్నియా, లాస్‌ఏంజిల్స్ వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన వార్తలివి. శుక్రవారం సాయంత్రం లాస్‌ఏంజిల్స్‌పై ఆకాశంలో భారీ చేప ఆకారంలో తెల్లని కాంతి కనిపించింది.

aliens

కాలిఫోర్నియా మీదుగా వచ్చిన ఈ కాంతిని చూసి స్థానికులు గ్రహాంతరవాసుల అంతరిక్ష నౌకగా భావించి, దాన్ని చూసేందుకు ఎగబడ్డారు. రోడ్లపై వాహనాలను నిలిపేసి ఫొటోలు, వీడియోలు తీశారు. చాలా మంది అత్యవసర సేవల నంబర్ 911కు ఫోన్ చేసి సాయం అడిగారు.

లాస్‌ఏంజిల్స్‌లోని ఓ ప్రాంతం నుంచి ఏకంగా 130 మంది ఫోన్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరికొందరు టీవీ చానళ్లకు ఫోన్ చేసి వివరాలను ఆరా తీశారు. ఈ కాంతికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో నిమిషాల్లో వైరలయ్యాయి.

ఏలియన్స్ భూమి మీద దిగారని ఒకరు.. యూఎఫ్‌వోను చూశామని మరొకరు కామెంట్లు పెట్టారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ టెల్సా సీఈవో ఎలోన్ మస్క్ ఏకంగా అది ఉత్తర కొరియా నుంచి వచ్చిందని ట్వీట్ చేయడం మరింత సంచలనమైంది.

ఈ వార్తలకు చెక్ పెట్టిన స్పేస్ ఎక్స్ అది తాము ప్రయోగించిన పునర్వినియోగ రాకెట్ అని ప్రకటించింది. కాలిఫోర్నియాలోని వడెన్‌బర్గ్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా 10 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించామన్నది.

Leave a comment