Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

ఉభయ సభల్లో కాంగ్రెస్ నిర‌స‌న‌లు

Published on Dec 21 2017 // Politics

పార్లమెంటు ఉభయసభల్లోనూ కాంగ్రెస్ ఆందోళనలు బుధవారం కూడా కొనసాగాయి. మన్మోహన్‌పై చేసిన వ్యాఖ్యలకు మోదీ క్షమాపణ చెప్పాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు నాల్గవరోజు కూడా నిరసనకు దిగారు.

దీంతో చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

సభతో సంబంధం లేని బయటి వ్యవహారాలకు సభలో క్షమాపణ కోరడం సరికాదు. ఇక్కడెవరూ క్షమాపణ చెప్పబోరు అని వెంకయ్య స్పష్టంచేశారు.

ఎన్నికల కోసమే తానీ వ్యాఖ్యలు చేశానని ప్రధాని కనీసం సభలో ప్రకటిస్తే చాలని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ తెలిపినా, చైర్మన్ అందుకు సమ్మతించలేదు.

మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఆందోళన కొనసాగిస్తున్న కాంగ్రెస్ సభ్యులపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇది రాజ్యసభ. ఇక్కడ ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసే ప్రశ్నే లేదు. సభ గౌరవాన్ని దిగజార్చకండి అని సూచించారు.

అయినప్పటికీ సభ సద్దుమణగకపోవడంతో చైర్మన్ సభను గురువారానికి వాయిదా వేశారు. మరోవైపు లోక్‌సభలోనూ దుమారం కొనసాగింది.

కాంగ్రెస్ సభ్యుల నిరసనలు, నినాదాలు కొనసాగుతున్నప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. గందరగోళం సద్దుమణగకపోవడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ పలుమార్లు సభను వాయిదా వేశారు.

ట్రిపుల్ తలాక్ బిల్లుపై ముస్లిం సంస్థలతో చర్చించలేదు

ట్రిపుల్ తలాక్ ముసాయిదా బిల్లును రూపొందించడానికి ముందు ప్రభుత్వం ముస్లిం సంస్థలతో చర్చించలేదని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరి వెల్లడించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే బిల్లును రూపొందించినట్లు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

స్వదేశానికి తిరిగివస్తున్న శాస్త్రవేత్తల సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని కేంద్రమంత్రి వైఎస్ చౌదరి తెలిపారు. 2007-12 మధ్యకాలంలో 243మంది, 2012-17 మధ్య 649 మంది శాస్త్రవేత్తలు స్వదేశానికి తిరిగి వచ్చారని చెప్పారు.

Leave a comment