Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

గుజరాత్ ఫలితాలపై ఏపీలో ర‌గ‌డ‌

Published on Dec 20 2017 // Politics

గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో చిటపటలు సృష్టించాయి. గుజరాత్‌ గెలుపు ఊపులో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు రెండు రోజులుగా టీడీపీపై ఎక్కుపెట్టి వదులుతున్న విమర్శనాస్త్రాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

సోము వీర్రాజు వ్యక్తిగతంగాఈ విమర్శలు గుప్పిస్తున్నారా… లేక బీజేపీ వైఖరి కూడా అదేనా అనే అంశంపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే… రాష్ట్ర బీజేపీ నేతలెవరూ ఈ అంశంపై స్పందించడంలేదు. సోము వీర్రాజును నిలువరించడంలేదు.

అలాగని… ఆయనను వెనుకేసుకుని రావడంలేదు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత సోమవారం విజయవాడలో జరిగిన విజయోత్సవాల్లోనే సోము టీడీపీపై విమర్శలు సంధించారు.

ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లు ఇచ్చినట్లే ఇచ్చి టీడీపీ తమ వారిని ఓడిస్తోందని, వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు అన్న అంశాన్ని తమ పార్టీ శాసిస్తుందని వ్యాఖ్యానించారు.

ఆయన వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ అదే రోజు స్పందించారు. సోము వీర్రాజువి ఉత్తర కుమార ప్రగల్బాలని ఎద్దేవా చేశారు. బీజేపీ బలం గురించి ఆయన ఎక్కువ ఊహించుకొంటున్నారని వ్యాఖ్యానించారు.

ఈ విమర్శలు ప్రతివిమర్శల గురించి తెలిసిన వెంటనే విదేశీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. మంగళవారం ఉదయమే ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయ నాయకులతో మాట్లాడారు.

టీడీపీ నేతలు ఎవ్వరూ బీజేపీ నేతలపై వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడిన మాటలు తప్పని, పార్టీ అనుమతి లేకుండా మరోసారి అలా మాట్లాడవద్దని ఆయనను పిలిచి చెప్పాలని పార్టీ నేతలను ఆదేశించారు.

ఈ పరిణామాల గురించి తెలిసిన తర్వాత కూడా సోము వీర్రాజు టీడీపీపై మాటల దాడిని ఆపలేదు. పైగా మరింత దూకుడు ప్రదర్శించారు. మంగళవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబుపైనా విమర్శలు సంధించారు. చంద్రబాబు తప్పుడు నిర్ణయాల వల్ల తమ పార్టీతోపాటు మొత్తం దేశం కూడా నష్టపోయిందని, ఆయనతో కలిసి ఉండటం వల్ల తాము మునిగిపోయామని సోము వ్యాఖ్యానించారు. పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలను విలేకరులు ప్రస్తావించినప్పుడు.

మీడియాకు కావాల్సిన విషయాలు తాను మాట్లాడబోనని, తాను ఏది మాట్లాడదల్చుకొన్నానో అదే మాట్లాడతానని ఆయన పేర్కొన్నారు.

సోము వ్యాఖ్యలు టీడీపీ వర్గాలను విస్మయపర్చాయి. గుజరాత్‌ ఫలితాలకు.. ఇప్పుడు టీడీపీపై విమర్శలకు సంబంధం ఏమిటని వారు ఆశ్చర్యపోతున్నారు. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వ వైఖరి కూడా చర్చనీయాంశంగా మారింది. ‘టీడీపీలో ఒక నేత పార్టీ వైఖరికి విరుద్ధంగా మాట్లాడితే చంద్రబాబు వెంటనే జోక్యం చేసుకొని ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారు.

సోము వీర్రాజు మాటలపై ఆ పార్టీ నాయకత్వంలో ఎలాంటి స్పందనా లేదు. ఇది మాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది’ అని టీడీపీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. సోము వీర్రాజు వ్యాఖ్యల తర్వాత మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఆయన చాలా సంయమనం ప్రదర్శిస్తూ మాట్లాడారు. సోము విమర్శలపై చర్చాగోష్టికి రావాల్సిందిగా టీవీ చానళ్ల నుంచి ఆహ్వానాలు అందినా సోమిరెడ్డి తిరస్కరించారు. తమ పార్టీ నిర్ణయం ప్రకారం ఇటువంటి చర్చల్లో పాల్గొనలేనని ఆయన వారికి స్పష్టం చేశారు.

బీజేపీ వైఖరి ఏమిటి?
ఎవరైనా నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు ‘అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. పార్టీతో సంబంధం లేదు’ అని సంబంధిత పార్టీ ప్రకటించడం సర్వ సాధారణంగా జరిగేదే. అయితే సోము వీర్రాజు వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏ ప్రతిస్పందనా వ్యక్తం చేయకుండా మౌనం వహించింది.

ఆయన యథాలాపంగా మాట్లాడి ఉండవచ్చని, వాటిని సీరియ్‌సగా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. టీడీపీ విషయంలో సోము వీర్రాజు మొదటి నుంచి కొన్ని భావాలతో ఉన్నారని, ఆయన మాటలు తమకేమీ ఆశ్చర్యం కలిగించలేదని కూడా ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా కింది స్థాయి నాయకుల విమర్శలు ప్రతివిమర్శలతో సంబంధం లేకుండా పైస్థాయిలో పరస్పర అభినందనలు, పలకరింపులు కొనసాగుతున్నాయి.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు చంద్రబాబు మంగళవారం ఫోన్‌ చేసి గుజరాత్‌, హిమాచల్‌ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. ఈ నెల 23నపోలవరానికి వస్తున్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన ఏర్పాట్లను అడిగి తెలుసుకొన్నారు.

అమిత్‌ షాకు చంద్రబాబు అభినందనలు
గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో విజయం సాధించినందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న సీఎం అక్కడి నుంచే అమిత్‌ షాకు ఫోన్‌ చేసి మాట్లాడారు

Leave a comment