Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

4:23 am - కాబూల్‌లో భారీ ఉగ్రదాడి// 1:01 pm - స‌రిహ‌ద్దులో పాక్‌ విచ్చలవిడి కాల్పులు// 12:31 pm - విమాన ప్రయాణం మరింత సురక్షితం..!// 12:30 pm - యంగ్ ఇండియన్ పేరుతో ద‌గా..?// 12:11 pm - RSSలో తీవ్ర‌ కలకలం…?// 12:05 pm - వర్మ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి-కృష్టంరాజు// 3:33 am - విమానంలో ఇకై కాల్స్‌, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌..!// 3:24 am - నెల్లూరు-కడప మధ్య నేరుగా రైలు// 3:20 am - టి.సుబ్బరామిరెడ్డికి హెరిటేజ్ ట్రస్ట్ హెచ్చరిక// 3:19 am - మోదీవల్లే ముస్లింలు ఏకమయ్యారు- ఓవైసీ// 3:17 am - కష్టాలపై సుప్రీంకోర్టుకైనా వెళతాం-సీఎం// 12:44 pm - 20 మంది అప్ ఎమ్మెల్ల్యేల‌పై అన‌ర్హ‌త వేటు// 12:42 pm - న‌టుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు// 12:34 pm - యాంకర్ ప్ర‌దీప్‌కు జరిమానా, లైసెన్స్ రద్దు// 11:33 am - నాసా అత్యంత అరుదైన ఘ‌న‌త దిశ‌గ‌..// 11:24 am - సోషల్‌మీడియాకు కళ్లెం..ఆర్మీచీఫ్‌// 11:20 am - విమానా ప్ర‌యాణికుల్లో ఆందోళ‌న‌..?// 6:44 am - బాల‌య్య‌ సమాధానం చెప్పాలి-లక్ష్మీ పార్వతి// 6:36 am - గ‌వ‌ర్న‌ర్‌పై బీజేపీ తీరుతో స‌ర్దుబాటు..!// 10:12 am - మంగళగిరిలో ఐటి కంపెనీలు//

పాత నిబంధనలకు US ఎఫ్‌సీసీ ఓటు

Published on Dec 18 2017 // NRI

ఇంటర్నెట్ తటస్థత (నెట్ న్యూట్రాలిటీ)కి వ్యతిరేకంగా అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) ఓటు వేసింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్పీ) కొన్ని వెబ్‌సైట్లకు అనుకూలంగా పనిచేయడం, మరికొన్నింటిపట్ల వివక్ష చూపడం, కొన్ని సేవల వేగాన్ని తగ్గించడంలాంటి చర్యలను నెట్ న్యూట్రాలిటీ నిషేధించింది.

అయితే తాజా నిర్ణయంతో తిరిగి పూర్వ పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. 2015లో ఇంటర్నెట్ తటస్థతకు అనుకూలమైన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇందులోని చాలా నిబంధనలను ఎఫ్‌సీసీ తొలిగించింది.

ఇంటర్నెట్ తటస్థత ప్రకారం.. వెబ్ ట్రాఫిక్, డేటా ప్యాకేజీలు సమానంగా ఉండేలా ఐఎస్పీలు చూడాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రత్యేకంగా ఏ ఒక్క వెబ్‌సైట్‌కు ప్రత్యేక మొత్తాల్ని చెల్లించాల్సిన అవసరం ఉండదు. అలాగే ఏదైనా ఒక వెబ్‌సైట్ సేవను ఉచితంగా వాడుకునే అవకాశాలూ ఉండవు.

అంటే అన్ని డేటా ప్యాకేజీలు సమానంగా ఉంటాయి. దీని ప్రకారం వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐఎస్పీలు ప్రత్యేకంగా వ్యక్తిగత ప్యాకేజీలను అందించే వీలుండదు.

నెట్ న్యూట్రాలిటీతో ఐఎస్పీలు కేవలం నెట్ కనెక్షన్ ఇవ్వడం మాత్రమే కాదు.. వారి సొంత సేవలు, యాప్స్ అందిస్తున్నాయి. అదేవిధంగా ఇతర పోటీదారులతో సమానంగా వేగాన్ని కూడా అందిస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని గత నిబంధనలను పునరుద్ధరించాం.

స్వతంత్ర ఇంటర్నెట్ వినియోగాన్ని పునరుద్ధరించేందుకు ఇది సరైన సమయం. ఈ నిర్ణయం నిస్సందేహంగా చట్టబద్ధమైనదే అని ఎఫ్‌సీసీ చైర్మన్ అజిత్ పాయ్ పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ ప్రాబల్యం ఉన్న కమిషన్ 3-2 ఓట్లతో పూర్వపు నిబంధనలను పునరుద్ధరించింది.

ఇది వినియోగదారులకు మేలు చేసే చర్య కాదని, పెద్ద పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయమని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే అమెరికా కంపెనీలైన ఫేస్‌బుక్, ఆల్ఫాబెట్‌లతోపాటు అమెరికా పౌరహక్కుల సంఘం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఎఫీసీసీ మాత్రం.. ఫెడరల్ ట్రేడ్ కమిషన్‌కు ఉన్న జ్యురీస్‌డిక్షన్ అధికారాలను పునరుద్ధరించామని, పోటీతత్వానికి వ్యతిరేకమైన, పారదర్శకతలేని, మోసపూరిత వ్యవహారాలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ నిర్ణయంపై ఐఎస్పీలు హర్షం వ్యక్తంచేశాయి.

Leave a comment