Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

పోల‌వ‌రంపై కేంద్రం భరోసా

Published on Dec 06 2017 // News

15 రోజులకోసారి పోలవరానికి వస్తానన్న గడ్కరీ
పని ఆపొద్దని ప్రస్తుత గుత్తేదారులకు ఆదేశం
కొత్త టెండర్లపై సీఎంతో మాట్లాడి నిర్ణయం
గుత్తేదారుకు ఆర్థిక వెసులుబాటుపై త్రిసభ్య కమిటీ తక్షణ నివేదిక
22న కేంద్ర మంత్రి రాక

పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను వచ్చి స్వయంగా పనుల ప్రగతిని పరిశీలిస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. దేశమంతటా 7.2 లక్షల కోట్ల పనులు చేయిస్తున్న తనకు దీనిని నిర్దేశించిన సమయంలోగా ఎలా పూర్తి చేయించాలో తెలుసునన్నారు. పనుల వేగం ఎందుకు మందగించిందంటూ ప్రధాన గుత్తేదారును, ఉపగుత్తేదారును నిలదీశారు.

వెంటనే పనుల వేగం పెంచాలని, డిసెంబర్‌ 22న తాను వస్తానని వెల్లడించారు. వేగం పెరగకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా తెలుసన్నారు. కొత్తగా టెండర్లు పిలిచినందున పనులు చేయాలో లేదో అర్థం కాక నిలిపివేసినట్లు ఉపగుత్తేదారు త్రివేణి సంస్థ పేర్కొనగా… ‘‘ వెళ్లి పనులు చేపట్టండి… బిల్లులు చెల్లించే బాధ్యత నాదని…’’ కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 60 సి కింద కొంత పని తొలగించి వేరే వారికి ఇస్తామంటోంది.

ఈ విషయంలో నాకు వేరే అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఈ విషయం మాట్లాడతా…’ అని గడ్కరీ స్పష్టం చేశారు. గుత్తేదారు ఆర్థిక సమస్యలు, పోలవరంలో ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ మూడు రోజుల్లో కూర్చుని నివేదిక పంపాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పిలిచిన టెండర్‌ ప్రక్రియపై ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ రాసిన లేఖ వివాదాస్పదమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి గడ్కరీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌, కమిషనర్‌ ఓరా, ఇతర ఉన్నతాధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముందు దక్షిణకొరియా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి గడ్కరీతో సుమారు 15 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు.

ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, సమస్యాత్మకంగా మారిన అంశాలు, వేగం మందగించిన పనులను కొత్త గుత్తేదారుడికి అప్పగించాలనుకోవడానికి దారి తీసిన కారణాలను వివరించారు. వాటన్నింటిపైనా కొరియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూలంకషంగా మాట్లాడుకొని పరిష్కరించుకుందామని గడ్కరీ ఆయనకు చెప్పారు. రూ.318 కోట్ల బిల్లులకు నిధులు విడుదల చేయగా… ఏఐబీపీ కింద చేపట్టిన ఏడు ప్రాజెక్టులకు మరో రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

చంద్రబాబుతో సంభాషణ ముగిసిన అనంతరం గడ్కరీ ఉన్నతస్థాయి భేటీకి హాజరయ్యారు. తొలుత ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఈ పనులు జరుగుతున్న వివరాలను వెల్లడించారు. తర్వాత ట్రాన్స్‌టాయ్‌ గుత్తేదారు మాట్లాడారు.

60సీ కింద కొత్త టెండర్‌ పిలవడంతో తమకు బ్యాంకులు సహకరించడం లేదని, రుణం రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ… ‘‘దాంతో మీకేం సంబంధం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండని..’’ ఆదేశించారు. 15 రోజుల్లో పనితీరులో వేగం చూపకపోతే అప్పుడు మీ సంగతి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

ప్రాజెక్టును ఆపమన్నామంటూ మీడియా అపోహలు సృష్టించిందని, ఆ నెపాన్ని తమపై నెట్టేయడానికి ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని నవ్వుతూ అన్నారు. ఇప్పటివరకూ జరిగిన వాటికి కొలతలు వేసి లెక్కలు తేలిస్తే తదుపరి పనులు ప్రారంభిస్తామని త్రివేణి ప్రతినిధులు చెప్పగా.. చీఫ్‌ ఇంజనీర్‌ స్పందిస్తూ ఒకరోజులోపు కొలతలు పూర్తి చేస్తామని చెప్పారు. గడ్కరీ మిగతా ఉపగుత్తేదారుల సమస్యలనూ ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు.

* ఆర్థిక సమస్యలపై త్రిసభ్య కమిటీ పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని గడ్కరీ చెప్పగా… గుత్తేదారుతో కుదిరిన ఒప్పందం ప్రకారం అది సాధ్యం కాదని ఈఎన్‌సీ చెప్పారు. సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలే తప్ప కఠినంగా ఉండకూడదన్నారు. సలహాదారు భార్గవ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు.
* కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ వద్ద పెండింగులో ఉన్న ఆకృతుల ఆమోదాన్ని తక్షణమే వేగవంతం చేయాలి.
* పునరావాస పెండింగు నిధులు తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం అథారిటీ తనిఖీ తర్వాత తమకు పంపితే చెల్లిస్తామని కేంద్ర అధికారులు చెప్పారు. గతంలో పునరావాస నిధులపై తర్వాత చూద్దామన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఇప్పుడు సానుకూలంగా స్పందించడం విశేషమని అధికారులు చెబుతున్నారు.
* 2018 కల్లా గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి.
* ఎగువ కాఫర్‌ డ్యాం ఆలస్యం కావడానికి వీల్లేదు. ఈ అంశంలో ఎన్‌హెచ్‌పీసీ నెలరోజులు ఆలస్యం చేయడం సమంజసం కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు. సమన్వయం చేసుకోవాలని కేంద్ర అధికారులను ఆదేశించారు.
* పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని తక్షణం రాజమండ్రికి తరలించాలి. అవసరమైన వసతులు కల్పిస్తామని జలవనరుల మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.
* టెండర్‌ కొనసాగించాలా వద్దా? అన్నది ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో నిర్ణయిస్తాం.
కేంద్రమూ కలిసి అడుగు…
తాజాగా కేంద్ర మంత్రి సమావేశం నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ బాధ్యతను కొనసాగిస్తూనే కేంద్రమూ పూర్తి స్థాయి పర్యవేక్షణ, ప్రగతి పరిశీలనకు నిరంతరం దృష్టి సారించేలా వెళ్లబోతోందని అవగతమవుతోంది. 2018 జూన్‌లోపు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశించడం, ఎగువ కాఫర్‌ డ్యాంపై కమిటీ రాక ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం..

.15 రోజులకోసారి స్వయంగా వస్తానని ప్రకటించడం ద్వారా దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారనే భావన రాష్ట్ర ప్రజల్లో కలిగించడంతో పాటు కేంద్ర రాష్ట్రాలు ఆ ఫలాలు పొందేలా వ్యూహరచన జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుత్తేదారుల సమస్యలు ఎలా పరిష్కరించాలో, ప్రాజెక్టు ఎలా నిర్మించాలో తనకు తెలుసునని గడ్కరీ వ్యాఖ్యానించడం ద్వారా కేంద్రం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లుగా భావిస్తున్నారు.
కాంగ్రెస్‌ నాయకులకు మాట్లాడే అర్హత లేదు: దేవినేని ఉమ
పదేళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు పరిధిలో కనీసం ఏడు ముంపు గ్రామాలను కూడా ఖాళీ చేయించలేని కాంగ్రెస్‌ నాయకులకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని జలవనరుల మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు. వైఎస్‌ అధికారంలో ఉన్న అయిదున్నరేళ్లకాలంలో రూ.128 కోట్ల పనులు.

.. రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రూ.70 కోట్ల పనులు మాత్రమే చేశారన్నారు. కాలువల్లో మట్టి తీసి డబ్బులు దండుకున్న వారికి ఏం అర్హత ఉందని గడ్కరీని కలుస్తారని ధ్వజమెత్తారు. వీళ్లు ఎన్ని రాళ్లు వేసినా 2018కల్లా గ్రావిటీతో నీరిస్తాం అని స్పష్టం చేశారు. ఇందుకోసం చంద్రబాబు, మోదీ ప్రభుత్వాలు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Leave a comment