Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

దక్షిణకొరియాలో చంద్రబాబు పర్యటన

Published on Dec 06 2017 // News

దక్షిణకొరియాలో మూడోరోజు సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఓసీఐ కంపెనీ సీఈవో హ్యూమ్‌లీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. వివిధ దేశాల్లో తమ కార్యకలాపాలపై ఓసీఐ సీఈవో ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

భారత్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్టు ఓసీఐ వెల్లడించింది. గతేడాది విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు ఓసీఐ సీఈవో హాజరైన విషయం తెలిసిందే.

సౌర విద్యుత్‌ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. అంతేకాకుండా ప్రసిద్ధ ఎలక్ట్రానిక్‌ సంస్థ ఎల్‌జీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాలను చంద్రబాబుకు ఎల్‌జీ ప్రెసిడెంట్‌ సూన్‌ వివరించారు.

ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని చంద్రబాబు కోరారు. దేశ సగటు వృద్ధిరేటు కంటే రెట్టింపు వృద్ధిరేటు సాధిస్తున్నామని బాబు వివరించారు. ఏపీలో పెట్టుబడులపై తమ బోర్డుతో సూన్‌ చర్చిస్తామన్నారు.

Leave a comment