Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

వెంకీ,అనుష్కతో ‘ఆటా నాదే వేటా నాదే’ !

Published on Dec 06 2017 // Movie News

‘గురు’ సినిమాతో తన సత్తా చాటిన విక్టరీ వెంకటేష్ తర్వాతి సినిమా ‘ఆటా నాదే వేటా నాదే’. చాలాకాలం తర్వాత మరోసారి విజయాల బాట పట్టిన తేజ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

అయితే ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాలో వెంకీ సరసన అనుష్క ఆడిపాడనుందని తెలుస్తోంది. ఇందులో వెంకీ ఓ డిఫరెంట్ లుక్‌లో దర్శనమీయనుండటంతో ఆయన సరసన స్వీటీ అయితేనే బాగుంటుందని భావించిన యూనిట్ అనుష్కతో సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.

కొద్దిరోజులుగా ఈ సినిమాలో వెంకీ సరసన హీరోయిన్‌గా కాజల్, తమన్నా పేర్లు వినిపించాయి. కానీ తాజాగా వారిద్దరూ కాదంటూ అనుష్క పేరు మారుమ్రోగిపోతోంది. మరోవైపు అనుష్క కూడా తన ‘భాగమతి’ సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకోవడంతో వెంకీతో నటించేందుకు సిద్ధంగా ఉందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక వెంకీ- అనుష్క కాంబో అని వార్త బయటకు వచ్చిందో లేదో.. వారిద్దరి ఆటా వేట చూడాలని దగ్గుబాటి అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. మొత్తానికైతే అధికారిక ప్రకటన వెలువడితే గాని తెలియదు వెంకీ కోసం అనుష్కను తీసుకున్నారా.. లేక వేరే హీరోయిన్‌ను తీసుకున్నారా ? అనేది..

Leave a comment