Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఇంద్రసేన సినిమా స‌మీక్ష‌

Published on Dec 06 2017 // Movie News

సాధార‌ణంగా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండే తండ్రి..త‌న కుంటుంబం కోసం ఎంతో త్యాగం చేస్తుంటాడు. అయితే అదేంట‌నేది మ‌న‌కెవ‌రికీ తెలియ‌దు.

మ‌నం తండ్రియితేనే మ‌న తండ్రి గొప్ప‌త‌నం అర్థ‌మ‌వుతుంది. తండ్రి లేని కుటుంబానికి అన్న పెద్ద దిక్కుగా నిలుస్తాడు. అలాంటి ఓ అన్న క‌థే ఇంద్ర‌సేన‌. బిచ్చ‌గాడు సినిమాతో క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోనికి త‌ర్వాత భేతాళుడు, యెమ‌న్ సినిమాలు తెలుగులో మంచి విజ‌యాల‌ను అందించ‌లేక‌పోయాయి.

బిచ్చ‌గాడు చిత్రంలో మ‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆక‌ట్టుకున్న విజ‌య్ ఆంటోని..ఈసారి బ్ర‌ద‌ర్ సెంటిమెంట్‌తో ఆకట్టుకోవ‌డానికి రెడీ అయ్యాడు. మ‌రి ఇంద్ర‌సేన‌తో విజ‌య్ ఆంటోని మ‌ళ్లీ స‌క్సెస్ కొట్టాడా? ప‌్రేక్ష‌కుల‌ను మెప్పించాడా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో ఓ లుక్కేద్దాం…

క‌థ:
నూజివీడులో క‌థ ప్రారంభం అవుతుంది. ఇంద్ర‌సేన‌, రుద్ర‌సేన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు. క‌వ‌ల‌పిల్ల‌లు. ఇంద్ర‌సేన ప్రేమించిన అమ్మాయి ఎలిజిబెత్ ఓ యాక్సిడెంట్‌లో చ‌నిపోతుంది. ఆమె జ్ఞాప‌కాల్లో తాగుతూ బ్ర‌తికేస్తుంటాడు. (చివ‌రి వ‌ర‌కు ఆ ఎలిజిబెత్‌ను ప్రేక్ష‌కుల‌కు క‌న‌ప‌డ‌దు).

ఓ రాత్రి వేళ‌లో ఇంద్ర‌సేన ఓ అమ్మాయిని ప్ర‌మాదం నుండి కాపాడుతాడు. ఆ అమ్మాయి ఇంద్ర‌సేన‌కు త‌న మ‌న‌సులో మాట‌ను చెప్పినా సున్నితంగానే తిర‌స్క‌రిస్తాడు ఇంద్ర‌సేన‌. ఇత‌న త‌మ్ముడు రుద్ర‌సేన మాత్రం ఓ స్కూల్‌లో పి.ఇ.టి టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. బాధ్య‌త‌గా ఇంటి వ్య‌వ‌హ‌రాల‌ను చూసుకుంటూ ఉంటాడు. ఇంద్ర‌సేన‌ను కూడా ఓ అమ్మాయి ప్రేమిస్తుంది.

మ‌రోవైపు రుద్రసేన‌కు అత‌ని మావ‌య్య కూతురు రేవ‌తి(డ‌యానా చంపిక‌)తో పెళ్లి కుదురుతుంది. త‌న తాగుడు వ్య‌వ‌హారాల కార‌ణంగా కుటుంబ స‌భ్యులు బాధ‌ప‌డుతున్నార‌ని తెలిసిన ఇంద్ర‌సేన తాగుడు మానేయాల‌నుకుని, చివ‌రి సారి పుల్‌గా మందు కొట్టాల‌నుకుంటాడు. ఆ మందు కొట్టిన మైకంలో త‌న‌కు తెలియ‌కుండానే ఓ వ్య‌క్తిని చంపేస్తాడు.

దాంతో ఏడేళ్లు కారాగార శిక్ష‌ప‌డుతుంది. జైలు నుండి ఇంటికి వ‌చ్చిన ఇంద్ర‌సేన‌కు త‌మ్ముడు రుద్ర‌సేన పెద్ద రౌడీలా క‌న‌ప‌డ‌తాడు. అస‌లు రుద్ర‌సేన రౌడీగా మార‌డానికి కార‌ణ‌మేంటి? ఇంద్ర‌సేన త‌మ్ముడిని ఎలా కాపాడుకుంటాడు? ఇంద్ర‌సేన త‌మ్ముడిని కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ఎలాంటి త్యాగానికి సిద్ధప‌డ‌తాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:
ద్విపాత్రాభిన‌యంలో విజ‌య్ ఆంటోని చ‌క్క‌టి వేరియేష‌న్స్‌ను చూపించాడు. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సీన్స్‌లో విజ‌య్ ఆంటోని న‌ట‌న మెప్పిస్తుంది. విజ‌య్ ఆంటోని ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ మెప్పిస్తుంది. ఇక త‌మ్ముడి కోసం అన్న‌గా ప‌డే త‌ప‌న‌ను తెర‌పై త‌న ఎక్స్‌ఫ్రెష‌న్స్‌తో చ‌క్క‌గా ఎలివేట్ చేశాడు విజ‌య్ ఆంటోని.

అలాగే మ‌రోవైపు పి.ఇ.టి టీచ‌ర్‌గా, గూండా రుద్ర‌సేన‌గా విజ‌య్ ఆంటోని త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించాడు. ఇక రొమాంటిక్ ల‌వ్ సీన్స్‌లో మాత్రం విజ‌య్ ఆంటోని న‌ట‌న‌తో బెరుకుత‌నం క‌న‌ప‌డింది. పాట‌ల్లో డ్యాన్సులు చేయ‌కుండా ఎలాగో మెనేజ్ చేసేయ‌డం క‌నిపిస్తుంది.

డ‌యానా, మ‌హిమాలు చ‌క్క‌గా న‌టించారు. పాత్ర‌లకు త‌గిన విధంగా న్యాయం చేశారు. ఇద్ద‌రు బొద్దుగానే క‌న‌ప‌డ్డారు. ఇక రాధార‌వి ఇత‌ర స‌హాయ న‌టులంద‌రూ త‌మిళ‌వారు కావ‌డం కాస్త మింగుడు ప‌డని వ్య‌వ‌హార‌మే. ప‌స్టాఫ్‌లో కుటుంబం, ప్రేమ‌, అన్న‌ద‌మ్ముల మ‌ధ్య గొడ‌వ అంటూ సాగుతుంది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

కానీ దాని త‌రువాత వ‌చ్చే క్ర‌మంలో రుద్ర‌సేన రౌడీగా మార‌డం వెనుక ప‌రిస్థితులు కాస్త నాట‌కీయంగా అనిపించాయి. ప్రీ క్లైమాక్స్ స్టేజ్ వ‌చ్చేస‌రికి క్లైమాక్స్‌ను ప్రేక్ష‌కుడు ముందుగానే ఊహించేస్తాడు. అయితే క్లైమాక్స్‌లోని సెంటిమెంట్ దానికి త‌గిన విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ క్లైమాక్స్‌కు బ‌లాన్ని చేకూర్చాయి. అయితే ఎమోష‌న్స్ మిన‌హా క్లైమాక్స్ కంటెంట్ ప‌రంగా వీక్ అయ్యింది.

ఎన్‌కౌంట‌ర్ తర్వాత పోలీసులకు చ‌నిపోయింది ఇంద్ర‌సేన అని తెలియ‌కుండా ఎలా ఉంటుందో అర్థం కాదు. ఇలాంటి లాజిక్స్ ద‌ర్శ‌కుడు మిస్ అయ్యాడు. బిచ్చ‌గాడు వంటి ఎమోష‌న‌ల్ మూవీకి, ఇంద్ర‌సేన ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అవుతుందేమో కానీ కంటెంట్ ప‌రంగా మాత్రం కాదు. క్లైమాక్స్‌లో లేడీ పోలీసును విజ‌య్ ఆంటోని బ్ర‌తిమాల‌టం వంటి స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడికి న‌చ్చుతాయి. ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ సకండాఫ్ క‌థ‌లోని టెంపోను మిస్ చేశాడ‌నిపించింది.

విజ‌య్ ఆంటోని సంగీతం అందించిన పాట‌లు విజువ‌ల్‌గా బావున్నాయే కానీ, ట్యూన్స్ ఆక‌ట్టుకోవు. అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. విజ‌య్ ఆంటోని ఎడిటింగ్ వ‌ర్క్ కూడా బావుంది. సినిమాటోగ్రాఫ‌ర్ దిల్‌రాజు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మొత్తంగా చూస్తే బిచ్చ‌గాడు సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్‌తో వెళితే కాస్త నిరాశ‌కు లోన‌వ‌డం త‌ప్ప‌దు.

స‌మ‌ర్ప‌ణ: నీలం ల‌క్ష్మి
నిర్మాణ సంస్థ: ఎన్‌.కె.ఆర్‌.ఫిలింస్‌, ఆర్‌.స్టూడియోస్‌, విజ‌య్ ఆంటోని ఫిలిం కార్పొరేష‌న్‌
తారాగ‌ణం: విజ‌య్ ఆంటోని, డ‌యానా చంపిక‌, మహిమా, జ్వెల్ మారీ, రాధా రవి, కాళీ వెంకట్, నళినీ కాంత్, రింధు రవి తదితరులు
మాటలు- సాహిత్యం: భాష్యశ్రీ
క‌ళ: ఆనంద్ మణి
సంగీతం – కూర్పు: విజయ్ ఆంథోని
ఛాయాగ్ర‌హ‌ణం: కె.దిల్ రాజ్
లైన్ ప్రొడ్యూసర్: శాండ్రా జాన్సన్,
నిర్మాతలు: రాధిక శ‌ర‌త్‌కుమార్‌, ఫాతిమా విజ‌య్ ఆంటోని, నీలం కృష్ణారెడ్డి
దర్శకత్వం: జి.శ్రీనివాసన్

Leave a comment