Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఆక్సిజన్ సినిమా స‌మీక్ష‌

Published on Dec 06 2017 // Movie News

2014లో విడుద‌లైన లౌక్యం త‌ర్వాత మూడేళ్లుగా స‌రైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు హీరో గోపీచంద్‌. ఎలాగైనా స‌క్సెస్ కొట్టాల‌నే తాప‌త్ర‌యం గోపీచంద్‌లో క‌న‌ప‌డుతుంది. వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నాడు కూడా. అయితే విజ‌యం గోపీచంద్‌తో దోబుచులాడుతుంది.

త‌న ప్ర‌య‌త్నాల్లో భాగంగా గోపీచంద్ త‌న‌కున్న యాక్ష‌న్ ఇమేజ్ బేస్ చేసుకుని చేసిన సినిమాయే `ఆక్సిజ‌న్‌`. టైటిల్ విభిన్నంగా ఉండ‌టంతో ప్రారంభంలో సినిమాపై ఆస‌క్తి ఏర్ప‌డింది. అలాగే ల‌క్ష్యం త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు, గోపీచంద్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కూడా ఇదే.

ఎప్పుడో నీ మ‌న‌సు నాకు తెలుసు అనే సినిమాను డైరెక్ట్ చేసిన ఎ.ఎం.ర‌త్నం త‌న‌యుడు ఎ.ఎం.జోతికృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో పాటు సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతూ రావ‌డం సినిమాపై ఓ ర‌క‌మైన అనాస‌క్తిని క్రియేట్ చేసింది. మ‌రి ఆక్సిజ‌న్ ఎలా ఉంది? ప‌్రేక్ష‌కుల‌ను అల‌రించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి లుక్కేద్దాం…

కృష్ణ ప్ర‌సాద్ ( గోపీచంద్‌) పెళ్లి చూపుల కోసం అమెరికా నుంచి రాజ‌మండ్రికి వ‌స్తాడు. అక్క‌డ ఊరి పెద్ద ర‌ఘుప‌తి (జ‌గ‌ప‌తిబాబు) కుమార్తె శ్రుతి (రాశీఖ‌న్నా)ను చూసి ఇష్ట‌ప‌డి పెళ్లి చేసుకోవ‌డానికి అంగీక‌రిస్తాడు. ఆ పెళ్లి సంబంధంతో ర‌ఘుప‌తి ఇంట్లో మ‌నిషిలాగానే మారుతాడు. కానీ ర‌ఘుప‌తికి ఆ ఊర్లోని ఇంకో వ్య‌క్తి (సాయాజీ షిండే) ఫ్యామిలీతో గొడ‌వ ఉంటుంది.

ఆ గొడ‌వ వ‌ల్ల ర‌ఘుప‌తి అన్న‌, అన్న కుమారుడు, అల్లుడు కూడా చ‌నిపోయార‌ని అనుకుంటారు. కానీ వాళ్ల‌ను చంపింది అత‌ను కాదు. మ‌రో ఇద్ద‌రు అని తెలుసుకుంటారు. ఆ ఇద్ద‌రికి సంజీవ్ బాస్‌. ఇంత‌కీ సంజీవ్ ఎవ‌రు? అత‌నికి కృష్ణ ప్ర‌సాద్‌కి సంబంధం ఏంటి? ప‌త్తి అండ్ కోని ఎందుకు సంజీవ్ టార్గెట్ చేశాడు? ర‌ఘుప‌తి మంచి వాడా? చెడ్డ‌వాడా? కృష్ణ ప్ర‌సాద్‌కీ, శ్రుతికీ పెళ్లి జ‌రిగిందా? లేదా? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్లు
గోపీచంద్ న‌ట‌న బావుంది. వంద‌మందిని కొట్టే స‌న్నివేశం అత‌ని హైట్‌కీ, ప‌ర్స‌నాలిటీకి త‌గ్గ‌ట్టుగా ఉంది. అటు మంచి వాడిగానూ, చివ‌రిలో విల‌న్ గెట‌ప్‌లోనూ జ‌గ‌ప‌తిబాబు మెప్పించారు. రాశీఖ‌న్నా యాజ్ యూజువ‌ల్‌గా త‌న‌కు ఇచ్చిన పాత్ర‌లో న‌టించింది.

చంద్ర‌మోహ‌న్‌, సుధ జంట ఆక‌ట్టుకుంటుంది. అను ఇమ్మాన్యుయేల్ పాట‌లో గ్లామ‌ర్ డోస్ కాస్త పెంచింది. పాట‌లు విన‌డానికి బానే ఉన్నాయి. తెలుగు గురించి ప్ర‌స్తావించ‌డం బావుంది. ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌కి ముందు వ‌చ్చే ట్విస్ట్ ని ఎవ‌రూ అంత తేలిగ్గా ఊహించ‌లేరు. స‌మాజాన్ని ప‌ట్టి పీడిస్తున్న వ్య‌స‌నాన్ని గురించి ఈ సినిమాలో సూటిగా ప్ర‌స్తావించారు.

మైన‌స్ పాయింట్లు
ప్రారంభ స‌న్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. మామూలు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఉన్న స‌న్నివేశాల‌కు భిన్నంగా ఏవీ క‌నిపించ‌వు. గోపీచంద్ పంచెక‌ట్టుతో, పెళ్లి కొడుకులా ఎయిర్‌పోర్టు నుంచి వ‌చ్చే స‌న్నివేశాలు కాసింత అతిగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్‌, అలీ కామెడీ అనుకున్నంత‌గా పండ‌లేదు.

హీరోయిన్‌కీ, అలీకి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా మెప్పించ‌వు. సాయాజీషిండే గ్యాంగ్ ఎందుకు ఉంటుందో అర్థం కాదు. విల‌న్ ముఖాల‌ను వ‌రుస‌గా జ‌గ‌ప‌తిబాబు త‌మ్ముళ్లుగా చూపించిన‌ప్పుడే అస‌లు సిస‌లైన విల‌న్లు వాళ్లేన‌ని ప్రేక్ష‌కుడు ఊహించ‌గ‌ల‌డు. ట్రైల‌ర్ క‌ట్ చేసినంత ఓపిగ్గా సినిమా ఎడిటింగ్ విష‌యం మీద దృష్టి పెట్టి ఉండాల్సింది.

విశ్లేష‌ణ‌
ఈ చిత్ర ద‌ర్శ‌కుడు తీసుకున్న పాయింట్ చాలా మంచిది. ప్ర‌తి సినిమా ప్రారంభంలో చూపించే మ‌ద్య‌పానం, ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అనే అంశంతో త‌యారైన క‌థ ఇది. విచ్చ‌ల‌విడిగా స‌మాజంలోకి ప్ర‌వేశిస్తున్న కొన్ని అనామ‌క‌మైన సిగ‌రెట్ బ్రాండ్లు యువ‌త‌ను ఎలా అట్రాక్ట్ చేస్తున్నాయి?

ఎలా వ్యాధుల భారిన ప‌డేస్తున్నాయ‌న్న మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ దానికి త‌గ్గ‌ట్టు బ‌ల‌మైన స‌న్నివేశాల‌ను అల్లుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. `మిర్చి` నుంచి `ఆగ‌డు` వ‌ర‌కు చాలా స‌న్నివేశాలే గుర్తొస్తాయి ఈ సినిమాను చూస్తున్న‌ప్పుడు. హీరో మంచి త‌నాన్ని పొగుడుతూ వ‌చ్చే పాట `పండ‌గ‌లా దిగివ‌చ్చాడు..` అని కైలాష్ ఖేర్ పాడిన‌ట్టే అనిపిస్తుంది.

సెకండాఫ్ సినిమా కాసింత ఊపందుకున్న‌ట్టు అనిపించినా మ‌ధ్య‌లో డ్రాప్ కావ‌డాన్నీ గ‌మ‌నించివ‌చ్చు. స‌రిగా గ‌మ‌నించ‌గ‌లిగితే డ‌బ్బింగ్‌లోనూ కొన్ని చోట్ల లోపం క‌నిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ ది ఒక ర‌కంగా గెస్ట్ రోల్‌. `ఆక్సిజ‌న్‌` గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే మంచి ఆలోచ‌న‌ను మామూలు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌కి మార్చేశారు.

నిర్మాణ సంస్థ: శ్రీ సాయిరామ్ క్రియేష‌న్స్‌
తారాగ‌ణం: గోపీచంద్‌, అను ఇమ్మాన్యుయేల్‌, రాశి ఖ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు, శామ్‌, అశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, అభిమ‌న్యు సింగ్‌, వెన్నెల‌కిషోర్‌, అలీ, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు
సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా
ఛాయాగ్ర‌హ‌ణం: ఛోటా కె.నాయుడు, వెట్రి
కూర్పు: ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌
నిర్మాత: ఐశ‌్వ‌ర్య‌.ఎస్‌
ద‌ర్శక‌త్వం: ఎ.ఎం.జోతికృష్ణ‌

Leave a comment