Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

*మాతంగి* గా ర‌మ్య‌క్రిష్ణ సినిమా

Published on Dec 06 2017 // Movie News

రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఓ మలయాళ చిత్రం తెలుగులో మాతంగి పేరుతో విడుదల అవుతున్నది. శ్రీనివాస విజువల్స్ పతాకంపై కన్నన్ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.వేణుగోపాల్, సజ్జు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా రమ్యకృష్ణ మాట్లాడుతూ హారర్‌తో పాటు వినోదం, భావోద్వేగాలు మేళవించిన వినూత్న కథాంశమిది. ఓ ఇంటి నేపథ్యంలో కథ జరుగుతుంది. తన మరణానికి కారణమైన వారిపై అతీతశక్తి రూపంలో ప్రతీకారం తీర్చుకునే యువతి కథ ఇది. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. గ్రాఫిక్స్ కూడా ప్రాధాన్యత వుంటుంది. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దారు.

తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. నందినిరెడ్డి మాట్లాడుతూ మాతంగి పాత్రను రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ చేయలేరు. పాత్రలో ఆమె పరకాయప్రవేశం చేశారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు రమ్యకృష్ణ నటించిన అమ్మోరు గుర్తుకువచ్చింది. ఆ సినిమా స్థాయిలోనే ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమవుతుంది అన్నారు.

అనుక్షణం సస్పెన్స్ ప్రధానంగా సాగే కథాంశమిది, తెలుగు తెరపై ఇప్పటివరకు రానటువంటి ఇతివృత్తమని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రమ్యకృష్ణ తనయుడు రుత్విక్ అందరి దృష్టిని ఆకర్షించాడు. జయరాం, సంపత్, కళాభవన్‌మణి, వీణానాయర్, బేబి అక్షర, కిషోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: రతీష్ వేగ, ఆర్ట్: సాహస్‌బాల.

Leave a comment