Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

జవాన్ సినిమా స‌మీక్ష‌

Published on Dec 06 2017 // Movie News

మెగా ఫ్యామిలీ నుంచి కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చినా యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సాయిధరమ్‌తేజ్‌. అయితే ఇటీవల కాలంలో ఆయన నటించిన ‘తిక్క’, ‘విన్నర్‌’, ‘నక్షత్రం’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు బీవీఎస్‌ రవి చెప్పిన కథకు తేజూ పచ్చజెండా వూపారు. రవి గతంలో దర్శకత్వం వహించిన ‘వాంటెడ్‌’ కూడా ఆకట్టుకోలేకపోయింది.

అయినా, రవి చెప్పిన కథపై నమ్మకంతో తన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన, ఓ బాధ్యతాయుతమైన పాత్రను ఎంచుకున్నాడు సాయిధరమ్‌తేజ్‌. మరి వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘జవాన్‌’ ఎలా ఉన్నాడు? అతని లక్ష్యం ఏంటి? చివరికి దాన్ని చేరుకోగలిగాడా?
కథేంటంటే: జై (సాయిధరమ్‌తేజ్‌), కేశవ(ప్రసన్న) మంచి స్నేహితులు. జై నిజాయతీగా ఉంటాడు. దేశమంటే ఇష్టం. కేశవ తన స్వార్థం తాను చూసుకుంటూ ఉంటాడు.

భిన్న మనస్తత్వాల వల్ల వీరిద్దరూ చిన్నప్పుడే విడిపోతారు. జై బాగా చదువుకుని డీఆర్‌డీవోలో శాస్త్రవేత్తగా చేరాలనేది అతని ఆశయం. అందుకోసం కష్టపడుతుంటాడు. కేశవ పెద్దవాడయ్యాక మాఫియాతో చేతులు కలుపుతాడు. డీఆర్‌డీవోలో ఆక్టోపస్‌ మిసైల్‌ తయారవుతుంది. దాన్ని కాజేసి విదేశాలకు అమ్మేయాలని చూస్తుంటాడు కేశవ. ఆ ప్రయత్నాన్ని జై ఎలా తిప్పి కొట్టాడు? కేశవను ఎలా అడ్డుకున్నాడన్నదే ‘జవాన్‌’ కథ.

ఎలా ఉందంటే:
ఇద్దరు బలమైన, తెలివైన వాళ్ల మధ్య సాగే మైండ్‌ గేమ్‌ కాన్సెప్ట్‌ ఇది. ఒకరికి దేశభక్తి ఉంటే.. ఇంకొకరు తన స్వార్థం కోసం దేశానికి ద్రోహం చేయాలని చూసే వ్యక్తి. ఇది ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్‌ కథ. ఒకరిపై ఒకరు వేసుకునే ఎత్తులు.. పై ఎత్తులు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతినాయకుడు ఎప్పుడైతే బలవంతుడవుతాడో అప్పుడే కథానాయకుడిని ఇంకా బలంగా చూపించే అవకాశం ఉంటుంది.

ఈ కథలో ఆ అవకాశం దక్కింది. హీరో-విలన్ల మధ్య జరిగే సన్నివేశాలు ఈ కథకు బలం. వాటిని దర్శకుడు చక్కగా రాసుకొన్నాడు. ఆక్టోపస్‌ మిసైల్‌ ప్రతినాయకుడికి దక్కకుండా కథానాయకుడు చేసే ప్రయత్నాలు, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం ఆకట్టుకుంటాయి. ద్వితీయార్ధం మొత్తం హీరో-విలన్ల మధ్యే సాగుతుంది.

సాధారణంగా కథానాయకుడు.. ప్రతినాయకుడి ఇంట్లోకి వెళ్లి అక్కడి నుంచి కథను నడిపిస్తుంటాడు. కానీ, అందుకు భిన్నంగా ఇందులో కథానాయకుడి ఇంట్లోకి ప్రతినాయకుడు వచ్చి చేరతాడు. శత్రువు ఇంట్లో ఉన్నా సరే అతని గురించి తెలుసుకోవడానికి పోరాడుతుంటాడు కథానాయకుడు. వాటికి సంబంధించిన సన్నివేశాల్లో లాజిక్‌ ఎక్కడా మిస్‌ కాకుండా దర్శకుడు బీవీఎస్‌ రవి రాసుకోగలిగాడు. హీరోకు విలన్‌ ఎప్పుడు దొరుకుతాడన్న ఆసక్తి కలిగించాడు.

అయితే ప్రధాన కథకు హీరో ప్రేమ కథ బ్రేక్‌లు వేస్తుంటుంది. పాటల పరిస్థితీ అంతే. సరదాగా నవ్వుకోవడానికి ఒక్క సన్నివేశం కూడా లేదే అనిపిస్తుంది. విశ్రాంతి ముందు ఘట్టం, విలన్‌ను హీరో పట్టుకునే యత్నాలు దర్శకుడి ప్రతిభకు అద్దం పడతాయి. అయితే ఆక్టోపస్‌ మిసైల్‌, ప్రాజెక్టు 3 తదితర వ్యవహరాలు సామాన్య ప్రేక్షకుడికి కొంచెం అర్థం కాకపోవచ్చు. పతాక సన్నివేశాలు ఇంకాస్త ఇంటెలిజెంట్‌గా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
ఎవరెలా చేశారంటే:
ఇప్పటివరకూ సరదా సరదాగా, అల్లరి అబ్బాయి పాత్రల్లో నటించిన సాయిధరమ్‌తేజ్‌ తొలిసారి ఓ బాధ్యతాయుతమైన పాత్రలో కనిపించాడు. అతని లుక్‌, డైలాగ్‌ డెలివరీలో మార్పు కనిపించింది. తనదైన హుషారు తగ్గినప్పటికీ సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ చేయగలిగాడు.

గెలుపు, ఓటమి గురించి చెప్పే సందర్భంలో సాయి నటన బాగుంది. మెహరీన్‌ పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితమైంది. చాలా బొద్దుగా కనిపించింది. ప్రసన్నది కచ్చితంగా ఆకట్టుకునే పాత్ర. ‘ధ్రువ’లో అరవిందస్వామి పాత్రను ఎలా గుర్తుంచుకున్నారో ఇందులో ప్రసన్న పాత్రను అలాగే గుర్తుంచుకుంటారు. తెలుగులో అతనికి అవకాశాలు పెరుగుతాయి. హీరో-విలన్ల మధ్య నడిచే డ్రామా కావడంతో మిగిలిన ప్రాతలకు అంత ప్రాధాన్యం లేదు.

సాంకేతికంగా:
తమన్‌ పాటల్లో ‘బుగ్గంచున’ శ్రావ్యంగా వినిపించింది. యాక్షన్‌ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగుంది. వాటిల్లో కూడా దర్శకుడు బీవీఎస్‌ రవి తన ఇంటెలిజెన్స్‌ను చూపించడానికి ప్రయత్నించాడు.

స్క్రీన్‌ప్లే ప్రధానమైన కథ ఇది. మైండ్‌గేమ్‌కు సంబంధించిన సన్నివేశాలను బాగా రాసుకోగలిగాడు. మరీ ముఖ్యంగా డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. దేశభక్తికి సంబంధించిన సంభాషణలు అలరిస్తాయి. కె.వి.గుహన్‌ కెమెరా, నిర్మాణ విలువలు బాగున్నాయి.
చిత్రం: జవాన్‌
నటీనటులు: సాయిధరమ్‌తేజ్‌.. మెహరీన్‌.. ప్రసన్న.. సత్యం రాజేశ్‌.. కోట శ్రీనివాసరావు తదితరులు
సంగీతం: తమన్‌
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌
నిర్మాత: కృష్ణ
సమర్పణ: దిల్‌ రాజు
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బీవీఎస్‌ రవి
సంస్థ: అరుణాచల్‌ క్రియేషన్స్‌

Leave a comment