Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

దక్షిణ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌

Published on Dec 06 2017 // News

అమర్‌నాథ్‌ యాత్రికులపై ఈ ఏడాది జూలై 10న దాడి చేసిన ముగ్గురు లష్కరే తాయిబా ఉగ్రవాదులను హతమార్చినట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు.

వీరిలో ఇద్దరు పాకిస్థానీయులు అని చెప్పారు. దక్షిణ కశ్మీర్‌లో సోమవారం సాయంత్రం జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ హైవేపై వెళ్తున్న ఆర్మీ కాన్వాయ్‌పైకి ఖాజీగుండ్‌ వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఒక సైనికుడు మృతి చెందాడు. మరొకరు గాయపడ్డారు.

దీంతో భద్రతాదళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టగా రాత్రి 2 గంటల వరకూ ఎదురుకాల్పులు కొనసాగాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో ఒకరిని కుల్గావ్‌లోని హబియాష్‌ ప్రాంతానికి చెందిన యావర్‌ బసీర్‌గా గుర్తించారు.

మిగిలిన ఇద్దరిని పాకిస్థాన్‌కు చెందిన అబూ ఫుర్ఖాన్‌, అబూ మావియాగా గుర్తించారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడికి నేతృత్వం వహించిన అబూ ఇస్మాయిల్‌ మరణించిన తర్వాత దక్షిణ కశ్మీర్‌లో లష్కరే తాయిబా అధ్యక్ష బాధ్యతలను ఫుర్ఖాన్‌ చేపట్టాడు. ఈ ముగ్గురూ జూలైలో అమర్‌నాథ్‌ యాత్రికులపై జరిపిన దాడిలో పాల్గొన్నారని పోలీసులు చెప్పారు.

అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మరణించగా, 19 మంది గాయపడ్డారు. ఎన్‌కౌంటర్‌ ప్రాంతం నుంచి తప్పించుకొని అనంతనాగ్‌ జిల్లాలోని మెటర్నిటీ ఆస్పత్రిలో దాక్కున్న మరో ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిని హంజాపొర సంగం బిజిబెహరా ప్రాంతానికి చెందిన రషీద్‌ అహ్మద్‌ అల్లైగా గుర్తించారు. అతని నుంచి ఒక చైనా పిస్టల్‌ను, లైవ్‌ క్యాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లు కొనసాగుతాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు. సూరత్‌గఢ్‌ మిలటరీ స్టేషన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో 3 దశాబ్దాలకు పైగా సేవలందిస్తున్న 87, 47, 10 ఆర్మ్‌డ్‌ రెజిమెంట్‌ లకు రాష్ట్రపతి మెడల్స్‌ను ఆయన ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కశ్మీర్‌లో ఆపరేషన్లు నిరంతరం కొనసాగుతాయన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది 200 మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయని చెప్పారు. ఉగ్రవాద సంస్థల పట్ల పొరుగుదేశం ఎలా వ్యవహరిస్తుందన్నదే ముఖ్యమైన విషయమని పాకిస్థాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Leave a comment