Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ముంబైలోబీజేపీ నేత‌ యశ్వంత్‌ నిరసన

Published on Dec 06 2017 // News

మద్దతు పలికిన మమత, కేజ్రీవాల్‌
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంత రైతుల డిమాండ్లు పరిష్కరించే వరకు తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని బీజేపీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా తేల్చి చెప్పారు. ముంబైలోని పోలీస్‌గ్రౌండ్‌లో రైతులతో కలిసి దీక్ష చేస్తున్న ఆయన్ను సోమవారం పోలీసులు అక్కడే నిర్బంధించారు.

దీంతో రాత్రికి రైతులతో కలిసి యశ్వంత్‌ అక్కడే మంచంపై నిద్రించారు. ‘పోలీసులు మాపై నిర్బంధాన్ని తొలగించారు. కానీ, మా డిమాండ్లు పరిష్కరించేవరకు ఇక్కడ్నుంచి కదలం. ఆందోళన కొనసాగిస్తాం’ అని యశ్వంత్‌ మంగళవారం విలేకర్లతో చెప్పారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీలు ఆయనకు మద్దతు పలికారు. ‘కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హాను నిర్బంధించడం బాధాకరం. ఆయన్ను కలిసి సంపూర్ణ మద్దతు తెలిపేందుకు మా పార్టీ ఎంపీ దినేశ్‌ త్రివేదీని పంపుతున్నాం’ అని మమత ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

‘యశ్వంత్‌ను ఎందుకు అరెస్టు చేశారు? ఆయన్ను వెంటనే విడుదల చేయాలి’ అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు. యశ్వంత్‌ రైతుల సమస్యలపై ఆందోళన చేస్తున్నారని దీన్ని కూడా రాజకీయ చేయొద్దని బీజేపీ శ్రేణులు పేర్కొన్నాయి.

Leave a comment