Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

విశాల్‌ నామినేషన్‌పై హైడ్రామా.. ..!

Published on Dec 06 2017 // Politics

నో – ఎస్‌ – మళ్లీ తిరస్కరణ
నామినేషన్‌ తోసిపుచ్చిన రిటర్నింగ్‌ అధికారి.. మలుపు తిప్పిన ఆడియో
రాత్రి 11.10కి మళ్లీ మారిన పరిస్థితి.. తిరస్కరిస్తున్నట్లు ప్రకటన
తమిళ రాజకీయాల్లో అడుగు పెట్టగానే అదరగొడుతున్న కథానాయకుడు విశాల్‌కు నామినేషన్‌ దశలోనే చుక్కెదురైంది.

పట్టువదలకుండా పోరాడినప్పటికీ… ‘క్లైమాక్స్‌’లో మాత్రం ఫలితం తనకు వ్యతిరేకంగా వచ్చింది. ఆయన నామినేషన్‌ గంటల వ్యవధిలో తిరస్కరణ, స్వీకరణ… మళ్లీ తిరస్కరణకు గురైంది.

అమ్మ జయలలిత కన్నుమూతతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్‌గా విశాల్‌ దాఖలు చేసిన నామినేషన్‌పై రోజంతా హైడ్రామా చోటుచేసుకుంది. సోమవారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగియగా ఎన్నికల అధికారులు మంగళవారం వాటిని పరిశీలించారు.

నామినేషన్‌లో అభ్యర్థిని ప్రతిపాదిస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు సంతకాలు చేయాల్సి ఉంటుంది. విశాల్‌కు సంబంధించిన ఆ పదిమందిలో సుమతి, దీపన్‌ అనే ఇద్దరు ఓటర్లు ఉన్నారు. అయితే… వీరు ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించారు. ‘‘ఆ సంతకాలు మావి కావు. ఎవరో ఫోర్జరీ చేశారు’ అని రిటర్నింగ్‌ అధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

దీంతో విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారి ప్రకటించారు. దీంతో విశాల్‌ ఒక్కసారిగా దిగ్ర్భాంతికి గురయ్యారు. తమకు అన్యాయం జరిగిందంటూ విశాల్‌, అతని మద్దతుదారులు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ముందు బైఠాయించారు. పోలీసులు రంగంలోకి దిగినా, ఇతరులు సర్దిచెప్పినా… విశాల్‌ వెనక్కి తగ్గలేదు.

అదే సమయంలో… ఎందుకిలా జరిగిందో స్వయంగా ఆరా తీశారు. సుమతి సమీప బంధువైన వేలు అనే వ్యక్తికి ఫోన్‌ చేశారు. ‘ఎందుకిలా జరిగింది?’ అని ఆరా తీశారు.

అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదన్‌, ఆయన అనుయాయుడు రాజేశ్‌ తమ ఇంట్లో మహిళల్ని బెదిరించారని, కొంత డబ్బు ఇచ్చేందుకు కూడా ప్రయత్నించారని, అందుకే తమ కుటుంబీకులు రిటర్నింగ్‌ అధికారికి అలా లేఖ ఇవ్వాల్సి వచ్చిందంటూ వేలు పేర్కొన్నారు. ఈ ఆడియో టేప్‌ను విశాల్‌ మీడియాకు విడుదల చేశారు.

దీంతో… వివాదం మరో పెద్ద మలుపు తిరిగింది. ఆడియో క్లిప్‌ను విశాల్‌ రిటర్నింగ్‌ అధికారికి అందించారు. చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌ ఏకే జ్యోతితోనూ హీరో విశాల్‌ మాట్లాడారు. దీంతో ఈసీ ఆదేశాల మేరకు… విశాల్‌ నామినేషన్‌ పరిగణనలోకి తీసుకుంటున్నట్లు రాత్రి 8.30 గంటల సమయంలో రిటర్నింగ్‌ అధికారి వెల్లడించారు.

ఈ విషయాన్ని విశాల్‌ స్వయంగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ట్విట్టర్‌లోనూ ఈ వివరాలు పోస్ట్‌ చేశారు. తన నామినేషన్‌ వివాదంలో ఎట్టకేలకు న్యాయం గెలిచిందని తీవ్ర భావోద్వేగాల మధ్య ప్రకటించారు. బుధవారం నుంచి ప్రచారం సాగిస్తానని ప్రకటించారు.

అయితే… మంగళవారం రాత్రి 11 గంటలకు పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ‘‘ఆ సంతకాలు తమవి కావని సుమతి, దీపన్‌ స్వయంగా వచ్చి చెప్పారు. దీంతో సుమతి తరఫున మరెవరో మాట్లాడుతున్న సంభాషణల టేపులను పరిగణనలోకి తీసుకోలేం. విశాల్‌ నామినేషన్‌ తిరస్కరిస్తున్నాం’’ అని రిటర్నింగ్‌ అధికారి అధికారిక ప్రకటన జారీ చేశారు.

Leave a comment