Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

రంజనితో జైలులో చిన్నమ్మ భేటీ..!

Published on Dec 06 2017 // News

ఆ తర్వాతే తెరపైకి జయ కూతురు ఎపిసోడ్‌
నెచ్చెలి ఆస్తుల కోసం శశికళ కొత్త ఎత్తుగడ?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అంటూ మీడియా ముందుకు వచ్చిన బెంగళూరు యువతి చెబుతున్న మాటల్లో వాస్తవముందా? ఈ విషయంపై మీడియా తలబద్దలు కొట్టుకుంటుంటే…తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది.

అమృత జయ కుతురా కాదా అన్నది పక్కనబెడితే, ఆమెను బయటకు తీసుకొచ్చింది మాత్రం అన్నాడీఎంకే మాజీ ప్రధానకార్యదర్శి వీకే శశికళేనని తేలిపోయింది. జయ ఆస్తుల కోసమే ఆమెను బయటకు తెచ్చారా? లేక నిజంగానే జయ కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నారా అనేది తేలాల్సి వుంది.

జయ కుమార్తెను తానేనని, అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమంటూ అమృత గతంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రులకు లేఖ రాశారు. అటు నుంచి స్పందన లేకపోవడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

తనకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించాలని కూడా ఆమె అభ్యర్థించారు. అయితే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం ఆదేశించడంతో ఆమె ఆ ప్రయత్నాల్లో ఉన్నారు.

కాగా, సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఆమె మాటల్ని బలపరుస్తూ ఆమె బంధువులైన లలిత, రంజని సంతకాలు చేశారు. గతంలో లలిత మీడియాతో మాట్లాడేటప్పుడు…జయకు ఆడపిల్లకు జన్మనిచ్చిన మాట వాస్తవమేనని, జయ ప్రసవం సమయంలో ఆమె పక్కనే తమ దూరపు బంధువైన రంజని వుందని చెప్పారు.

అంతేగాక మూడునెలల క్రితం ఆమే అమృతను తీసుకొచ్చి జయ కుమార్తె అని తనకు పరిచయం చేశారని పేర్కొన్న లలిత..డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తే అసలు నిజాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు.

అయితే రంజని అనే మహిళ గతంలో పరప్పన అగ్రహారం జైల్లో శశికళతో భేటీ అయినట్లు ఓ తమిళ పత్రిక రికార్డులను బయటపెట్టింది.

ఈ రంజని జయలలిత తల్లి సంధ్యకు సమీప బంధువు. గతంలోనూ ఈమె పలుమార్లు పోయె్‌సగార్డెన్‌కు వచ్చివెళ్లేవారు. అంతేగాక శశికళకూ ఈమె పరిచయమే.

వీరిద్దరూ పరప్పన అగ్రహారం జైల్లో కలుసుకున్న తరువాత అమృత తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఇప్పుడెందుకు వీరు అమృతను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారనే దానిపై అనుమానాలు రేగుతున్నాయి.

ఒకవేళ శశికళ నిజంగానే అమృతను బయటకు తీసుకురావాలంటే ఆమె ఖచ్చితంగా జయ కుమార్తె అయి వుంటుందని అన్నాడీఎంకేలోని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే జయ ఆంతరంగిక విషయాలు శశికళకు బాగా తెలుసు. అందువల్ల జయ కుమార్తె ఎవరన్నదానిపై ఆమెకే స్పష్టత ఎక్కువ.

సికింద్రాబాద్‌ వెస్ట్‌మారేడుపల్లి రాధికా కాలనీలో వున్న ‘శశికళ నటరాజన్‌ నిలయం’లో జయ కుమార్తె పేరుతో ఒక యువతి సుదీర్ఘకాలం జీవించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆ ఇల్లు శశికళ పేరుపైనే వుంది. అంటే జయ కుమార్తె ఎవరన్నది ఆమెకు బాగా తెలుసు. అయితే ఆమె సదుద్దేశంతో ఈ పనికి పూనుకున్నారా లేక జయ ఆస్తుల కోసమే ఈ పాచిక వేశారా అన్నది తేలాల్సి వుంది.
రమ్యకృష్ణ రంగంలోకి దిగింది..

‘బాహుబలి’లో శివగామి క్యారెక్టర్‌లో మంచి పెర్‌ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్‌ చేసిన రమ్యకృష్ణ తాజాగా ‘మాతంగి’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

శ్రీనివాస విజువల్స్‌ ప్రై.లి. పతాకంపై కన్నన్‌ తామరక్కుళం దర్శకత్వంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్‌ ‘మాతంగి’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

రమ్యకృష్ణ, జయరాం, సంపత్‌, కళాభవన్‌ మణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్‌.వేణుగోపాల్‌, సజ్జు రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 15న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ‘మాతంగి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ని డిసెంబర్‌ 4న హైదరాబాద్‌ ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రమ్యకృష్ణ, ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి, చిత్ర నిర్మాత వినయ కృష్ణ వేదిక పై పాల్గొనగా రమ్యకృష్ణ ముద్దుల తనయుడు రుత్విక్‌ (రాజమాత శివగామి దేవీ కొడుకు) సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

ప్రముఖ దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ – ”వినయ వెరీ బిగ్‌ క్రిటిక్‌. బేసిగ్గా తనకి ఏ కథలు చెప్పినా త్వరగా నచ్చవు. అలాంటిది ఈ సినిమా కథ నచ్చి తెలుగులో ‘మాతంగి’ రిలీజ్‌ చేస్తున్నారు. రమ్యకృష్ణ ఏ క్యారెక్టర్‌ చేసినా తను తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అనేంతగా ఆ క్యారెక్టర్‌లో ఇన్‌వాల్వ్‌ అయి చేస్తారు.

నాకు రమ్యకృష్ణగారి ‘అమ్మోరు’ చాలా ఇష్టం. ‘మాతంగి’ ట్రైలర్‌ చూస్తుంటే ‘అమ్మోరు’ షేడ్స్‌ కన్పిస్తున్నాయి. అమ్మవారి క్యారెక్టర్‌లో రమ్యగారి ఎక్స్‌ప్రెషన్స్‌ చూస్తుంటే నిజంగా దేవతని చూసిన ఫీల్‌ కలిగింది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయి నిర్మాతగా వినయ సక్సెస్‌ కావాలి. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

రమ్యకృష్ణ మాట్లాడుతూ – ”శ్రీనివాస విజువల్స్‌ బేనర్‌లో కొన్ని సీరియల్స్‌ చేశాం. ఫస్ట్‌ టైమ్‌ ఒక చిన్న ప్రయత్నంగా సినిమా చేస్తున్నాం.

హర్రర్‌, కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ఈ చిత్రంలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో నటించాను. ముఖ్యంగా ‘అమ్మోరు’ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. డిసెంబర్‌ 15న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా రిలీజ్‌ విషయంలో మాకు సపోర్ట్‌ చేస్తున్న వేణుగోపాల్‌, సజ్జుగారికి నా థాంక్స్‌” అన్నారు.

Leave a comment