Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఉ.కోరియాకు ఐరాసలో అమెరికా హెచ్చరిక

Published on Dec 05 2017 // National

క్షిపణి పరీక్షలతో యుద్ధ సన్నాహాలు చేస్తున్న ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేస్తామని అమెరికా తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. దూకుడుగా వ్యవహరిస్తున్న ఆ దేశంతో ఆర్థిక, దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని ప్రపంచ దేశాలను కోరింది.

అమెరికాను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఉత్తరకొరియా విజయవంతంగా హాసంగ్ 15 ఖండాంతర క్షిపణిని పరీక్షించిన వెంటనే అత్యవసరంగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలని అమెరికా, జపాన్, దక్షిణ కొరియా కోరాయి.

ఈ నేపథ్యంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ ఉత్తరకొరియా చర్యలు ప్రపంచాన్ని యుద్ధం ముంగిట నిలుపుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

ఆ దేశం దూకుడు వల్లే యుద్ధం వచ్చే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఉత్తరకొరియాను సమూలంగా నాశనం చేస్తామని ఆమె హెచ్చరించారు. ఒకవైపు బహుళ రూపాల్లో ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నా ఉత్తరకొరియా నిత్య నూతనమైన, మరింత శక్తిమంతమైన క్షిపణుల పరీక్షలు కొనసాగిస్తున్నదని ఆరోపించారు.

ఉత్తరకొరియాతో ఐరాస సభ్యదేశాలు సంబంధాలు తెగదెంపులు చేసుకోవడంతోపాటు మిలిటరీ, శాస్త్రీయ, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని నిలిపివేయాలని కోరారు.

ఐరాసలో బ్రిటన్ రాయబారి మాథ్యూస్ రైక్రాఫ్ట్ మాట్లాడుతూ ఉత్తరకొరియా ఒక ముప్పుగా పరిణమించిందని, దీనికి ప్రపంచదేశాలు ఉమ్మడిగా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Leave a comment