Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఎన్నికల గుర్తుపై మధ్యంతర ఉత్తర్వులు

Published on Dec 05 2017 // News

తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో తమకు టోపి (హ్యాట్) గుర్తుపై పోటీచేసే అవకాశాన్ని కల్పించాలని కోరుతూ వీకే శశికళ-టీటీవీ దినకరన్ వర్గం చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ ఇందెర్మీత్ కౌర్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ), ఇరువర్గాల వాదనలను విన్న తర్వాత కోర్టు స్పందిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ చేసుకున్న అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం.

పిటిషనర్లకు ఈ కోర్టు ఎలాంటి ఉపశమనాన్ని కలిగించడం లేదు అని పేర్కొన్నది. మార్చి నెలలో ఏఐఏడీఎంకే రెండు గ్రూపులుగా విడిపోయిన సమయంలో ఆపార్టీ గుర్తు రెండాకులును ఈసీ స్తంభింపజేసింది. శశికళ వర్గానికి టోపి గుర్తును, పన్నీర్‌సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం గుర్తును ఈసీ కేటాయించింది.

అనంతరం నవంబర్ 23న ఏఐఏడీఎంకే గుర్తు రెండాకులును తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గానికి ఈసీ కేటాయించింది. శశికళ వర్గానికి టోపి గుర్తును కొనసాగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

దీనిపై పళనిస్వామి, పన్నీర్‌సెల్వం తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. టోపి ఏ పార్టీకి చెందిన గుర్తు కాదు.

అది స్వంతంత్ర గుర్తు, శశికళ-దినకరన్ వర్గం స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నందున వారికే టోపి గుర్తును పరిమితం చేయడం సమంజసం కాదు.

ఈసీ జాబితాలో ఉన్న మరేదైనా గుర్తును వారికి కేటాయించవచ్చు అని ఈపీఎస్-ఓపీఎస్ వర్గం వాదిస్తున్నది. తమకు మార్చి నెలలో టోపి గుర్తును ఈసీ కేటాయించిందని, దానికిందనే ఇప్పటివరకు ప్రచారం నిర్వహించామని శశికళ-దినకరన్ వర్గం కోర్టుకు విన్నవించింది.

Leave a comment