Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఎర్రమిర్చి.. యవ్వారం

Published on Dec 05 2017 // News

01. బుల్లెట్ ట్రైన్ అవసరం లేదనుకునే వారు ఎద్దుల బండ్లపై తిరగండి – ప్రధాని మోడీ…
బేసిక్ గా ఇట్టాంటి డవిలాగులు మా వర్మ దగ్గర వింటుంటాం – ఇప్నుడాయనకి తగ్గి ఈయనకి మొదలైనట్టుంది…!!

02. కాంగ్రేస్ అద్యక్షుడి పదవికి ఏ పోటీ లేకుండా నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ …
ఏక వర స్వయంవరం అన్నమాట – పోటీలేని పరీక్ష…!!

03. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు మైక్ కమింగ్ కి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన – హైకోర్టు…
మిగిలిన స్టాకు అమ్ముకొనే అవకాశం ఇచ్చారన్న మాట – భలే మంచి నిర్ణయాలు…!!

04. సినీ పరిశ్రమని విశాఖకి తరలించే ఆలోచన ప్రభుత్వానికే లేదు – అలాంటప్పుడు మేము ఎందుకు వస్తాం – తమ్మారెడ్డి …
బాబ్బాబ్బాబు – రాఁవంటే ఎట్టా సామీ – నాలుగు రాళ్ళేసేటోళ్ళు మీరు రాకపోతే ఎలా…??

05. ఉద్యోగార్హత వయోపరిమితిని 34 నుండి 42 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ …
ఏకంగా … 59 కి పెంచకూడదూ – ఓ ఏడాది పని చేసి ఎంచక్కా రిటైరైపోవచ్చు…!!

Leave a comment