Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

శశికపూర్‌కు ప్రముఖుల నివాళులు

Published on Dec 05 2017 // News

అలనాటి నటుడు శశి కపూర్‌(79) కన్నుమూతతో బాలీవుడ్‌ దిగ్భ్రాంతికి లోనైంది. ఎందరో సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకి ట్విటర్‌ ద్వారా ఘన నివాళులు అర్పిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎన్నటికీ మర్చిపోలేమంటూ ఉద్వేగానికి లోనవుతున్నారు.

* ‘ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని చాలా మిస్‌ అవుతాం శశికపూర్‌జీ’- సచిన్‌ తెంద్కులర్‌
* ‘శశి కపూర్‌ ఇక లేరని తెలిసి చాలా బాధపడ్డాను. గొప్ప నటుడు.

మంచి వ్యక్తి’- నీల్‌ నితిన్‌ ముఖేశ్‌(సాహో విలన్‌)
* ‘మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేం. సినిమాలతో మీరు అందించిన వినోదానికి ధన్యవాదాలు. స్టైల్‌ ఐకాన్‌, అందగాడైన శశి కపూర్‌ ఆత్మకుశాంతి కలగాలని కోరుకుంటున్నాను’- రితేశ్‌ దేశ్‌ముఖ్‌
* ‘ఆయన గురించి ఎన్నో గొప్ప విషయాలు విన్నాను, చూశాను. కానీ ఆయన్ని కలిసే అవకాశం దక్కలేదు’- తాప్సి
* ‘లెజెండ్‌లకు మరణం లేదు’- ఇషా గుప్తా
* ‘‘మేరే పాస్‌ మా హై’ అన్న ఒక్క డైలాగ్‌తో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమకు మీరు చేసిన సేవను ఎప్పటికీ మర్చిపోలేం’- అక్షయ్‌ కుమార్‌
* ‘భారత చిత్ర పరిశ్రమలో అద్భుతమైన నటుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- ధనుష్‌
* ‘చిత్ర పరిశ్రమలో అందగాడు. మా మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు.’- తమన్నా

 

వర్షం పడుతున్నా ఆయన కోసం వస్తున్నారు


ముంబయిలోని శాంతాక్రూజ్‌ ప్రాంతంలో ఈరోజు సాయంత్రం శశికపూర్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఓఖి తుపాను కారణంగా ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

అయినప్పటికీ ఆయన్ని ఆఖరిసారిగా చూసేందుకు ఎందరో బాలీవుడ్‌ ప్రముఖులు తరలి వస్తున్నారు. కపూర్‌ కుటుంబంతో పాటు షారుక్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్య రాయ్‌, అమితాబ్‌ బచ్చన్‌, లారా దత్తా, మహేశ్‌ భూపతి తదితరులు ఆయన్ని కడసారి చూసేందుకు తరలివచ్చారు.

Leave a comment