Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

విశాఖలో ఘనంగా నౌకాదళ దినోత్సవం

Published on Dec 05 2017 // News

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ తీరంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన నౌకాదళ విన్యాసాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కార్యక్రమ ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరుకాగా అతిథులుగా పర్యాటకమంత్రి భూమా అఖిలప్రియ, ఎంపీ హరిబాబు, పోర్టు ఛైర్మన్‌ కృష్ణబాబు, ఏయూ ఉపకులపతి ఆచార్య నాగేశ్వరరావు హాజరయ్యారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ కరంబీర్‌సింగ్‌ వారికి నౌకాదళ విన్యాసాల విశిష్టతలను వివరించారు.

తొలుత వేలాది అడుగుల ఎత్తు నుంచి ఆరుగురు మెరైన్‌కమాండోలు పారాచూట్ల సాయంతో విమానం నుంచి దూకేసి విన్యాసాల వేదిక ముందు తీరంలో దిగారు. ఒక మెరైన్‌ కమాండో నౌకాదళ జ్ఞాపికను మంత్రి గంటా శ్రీనివాసరావుకు బహుకరించారు.

అనంతరం వరుస విన్యాసాలు జరిగాయి. కదులుతున్న నాలుగు యుద్ధనౌకల వెనక భాగాల్లో చేతక్‌లు, యు.హెచ్‌.3.హెచ్‌., కమోవ్‌ హెలీకాప్టర్లు దిగి తమ నైపుణ్యాలను ప్రదర్శించాయి. సముద్రంలో మునుగుతున్న వ్యక్తిని యు.హెచ్‌.3.హెచ్‌.హెలీకాప్టర్‌ సిబ్బంది రక్షించే విన్యాసాలు ఆకర్షించాయి.

హాక్‌ యుద్ధవిమానాలు 600 కిలోమీటర్లకుపైగా వేగంతో తలకిందులుగా, గుండ్రంగానూ తిరుగుతూ ప్రయాణించిన విన్యాసాన్ని వీక్షకులు మైమరచి చూశారు.

సీకింగ్‌ 42 ఛార్లీ హెలీకాప్టర్‌ నుంచి తాడు సాయంతో సముద్ర ఉపరితలంపై ఉన్న బోటుపైకి చేరడం, పైకి ఎగబాకి హెలీకాప్టర్‌లోకి చేరుకోవడం, తాడుతో వేెలాడుతూ ప్రయాణించడం ఆకట్టుకున్నాయి.

శత్రుదేశ ఆయిల్‌రిగ్గులను ఎలా పేల్చివేస్తారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లు చూపేలా ఒక నమూనా రిగ్గును పేల్చారు. విశాఖ వాయుస్థావరం, అరక్కోణంల నుంచి నౌకాదళ వాయు స్థావరానికి చెందిన చేతక్‌, యు.హెచ్‌.3హెచ్‌., సీకింగ్‌ హెలీకాప్టర్లు, డోర్నియర్‌, హాక్‌, పి8ఐ యుద్ధ విమానాలతో ఫైపాస్ట్‌ నిర్వహించారు.

Leave a comment