Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

గుజ‌రాత్‌లో బీజేపీ నేతలకు కంగారే

Published on Dec 05 2017 // Politics

గుజరాత్‌ను అప్రతిహతంగా ఇరవై రెండేళ్లుగా ఏలుతున్న బీజేపీకి ముగ్గురు కుర్రాళ్లు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అనేక ఎన్నికల యుద్ధాలను గెలిచిన ప్రధాని మోదీకే కొరకరాని కొయ్యగా తయారయ్యారు.

నిజానికి 1985లో మోదీ రాజకీయాల్లో అడుగుపెట్టే నాటికి ఈ ముగ్గుర్లో ఒకరు పుట్టనేలేదు. మరొకరు తల్లి పొత్తిళ్లలో ఉన్నారు. ఇంకొకరు బడికి వెళ్తున్నారు.

ఇప్పుడు దేశ ప్రధానిగా ఎదిగిన ఆయనకు పెద్ద సవాలుగా మారారు. ఒంటిచేత్తో కేంద్రంలో అధికారాన్ని సాధించి… ఇంట గెలిచాం.

ఇక రచ్చ గెలుద్దాం. అంటూ విదేశాల్లో తిరుగుతున్న ప్రధానిలో ఈ యువకులంతా కలిసి ఓటమి భయాన్ని రేకెత్తించారు. నెల రోజులుగా సొంత రాష్ట్రానికి కట్టి పడేశారు.

ముగ్గురూ నిజానికి పట్టుదలలో మోదీకి వారసులు. కాకపోతే కాంగ్రె్‌సకు కలిసి వచ్చిన అదృష్ట దేవతలు. 2012 శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి, కాంగ్రె్‌సకు మధ్య ఓట్ల తేడా తొమ్మిది శాతం. నాడు 115 సీట్లు గెలిచినా… చాలాచోట్ల స్వల్ప మెజారిటీతో బయటపడింది.

గత ఐదేళ్లలో బీజేపీ ఓట్ల శాతం పెరగడానికి చెప్పుకోదగ్గ కారణం లేదు. కానీ, కాంగ్రె్‌సతో జతకట్టిన ఈ ముగ్గురూ కలిసి ఆ తొమ్మిది శాతాన్ని గట్టెక్కించగలరు. నిజానికి వాళ్లు నాలుగున్నర శాతాన్ని మారిస్తే చాలు అధికార సౌభాగ్యం కాంగ్రెస్‌ సొంతం అవుతుంది. ఎవరా ముగ్గురు? ఏమా కథ?

జిగ్నేశ్‌ మేవానీ
నలభై ఏళ్ల న్యాయవాది. దళిత ఉద్యమకారుడు. సౌరాష్ట్రలో నలుగురు దళిత యువకులను గోవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనన్న ఆరోపణతో చితకబాదిన ఘటనతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రముఖుడయ్యారు. ఉత్తర, మధ్య గుజరాత్‌లో వీరి ప్రాబల్యం అధికంగా ఉంది.

అల్పేశ్‌తో పాటు జిగ్నేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగారు. వారిద్దరినీ స్థానిక కాంగ్రెస్‌ నాయకత్వం వ్యతిరేకించినా జాతీయ నాయకత్వం పట్టుబట్టి బరిలో దించింది.

అల్పేశ్‌ ఠాకూర్‌
ముప్పయి ఐదేళ్ల యువకుడు. గుజరాత్‌లో 22 శాతం ఉన్న ఓబీసీ ఠాకూర్‌ నేత. ఇటీవలే కాంగ్రె్‌సలో చేరారు. మద్య నిషేధం అమల్లో ఉన్నా గుజరాత్‌లోని ఓబీసీల్లో మద్యం అలవాటు శ్రుతి మించింది. దానికి వ్యతిరేకంగా ఆయన ఉద్యమించారు.

దాంతో బీజేపీ సర్కారు తేరుకొని రాష్ట్రంలో మద్యం వ్యతిరేక చట్టాలను బలోపేతం చేయాల్సి వచ్చింది. గుజరాత్‌లోని 18,000 గ్రామాల్లో ఐదువేల గ్రామాలు అల్పేశ్‌ నేతృత్వంలోని ఓబీసీ-క్షత్రియ సంఘం ప్రాబల్యంలో ఉన్నాయి. ఆయన కులం మీటింగ్‌ పెట్టి పెద్దల అనుమతి తీసుకొని కాంగ్రె్‌సలో చేశారు.

హార్దిక్‌ పటేల్‌
పట్టుమని పాతికేళ్లు లేని యువకుడు. గుజరాత్‌లో అత్యంత శక్తిమంతమైన పటేల్‌ సామాజిక వర్గానికి ఆశాజ్యోతి. రాష్ట్ర జనాభాలో 14 శాతం ఉన్న పటేళ్లకు రిజర్వేషన్లు కావాలని స్వచ్ఛందంగా పెల్లుబికిన ఉద్యమానికి సహజ నాయకుడయ్యారు. బీజేపీలోని పటేళ్లు కూడా ఆయన్ను చూసి మురిసిపోతుంటారు.

హార్దిక్‌ లక్ష్యం ఒక్కటే. తమ డిమాండ్‌ను ఖాతరు చేయని బీజేపీ సర్కారును కూల్చేయడం. కాంగ్రెస్‌ రిజర్వేషన్లు ఇస్తుందా? ఇవ్వదా? అన్నది కూడా ఆయనకు అప్రస్తుతం. నిప్పులు చెరిగే ఆయన ప్రసంగాలు బీజేపీకి పీడకలలు. సెక్స్‌ సీడీల వంటి సమస్యలను కూడా అవకాశాలుగా మలచుకోగలగడం ఆయనకే చెల్లింది.

18 మంది ఉండే పటేల్‌ ఉద్యమ కమిటీలో సగం మందిని బీజేపీ లాగేసుకున్నా ఉద్యమం జోరు ఏ మాత్రం తగ్గలేదు. 2015 పటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమంలో పాల్గొన్న 15 మందిని ప్రభుత్వం పోలీసు కాల్పులతో పొట్టనబెట్టుకుందని, ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిందేనని ఆయన ఇచ్చే పిలుపునకు మంచి స్పందనే వస్తోంది.

ఏడాదిన్నర వ్యవధిలో హార్దిక్‌ 250 ర్యాలీల్లో పాల్గొన్నారు. పట్టణాల్లో జరిగే ర్యాలీల్లో పదివేల నుంచి 40 వేల మంది వరకు వస్తున్నారు. గుజరాత్‌లో ఒకప్పుడు పటీదార్లదే రాజ్యం. 1985లో తొలిసారిగా కాంగ్రెస్‌ నేత మాధవ్‌సింగ్‌ సోలంకీ పటీదార్లకు వ్యతిరేకంగా క్షత్రియ, హరిజన్‌, ఆదివాసీ, ముస్లిం వర్గాల కూటమిని జోడించి అధికారాన్ని సాధించారు.

అప్పటి నుంచి పటీదార్లు బీజేపీకి విశ్వాస పాత్రులుగా మారారు. మూకుమ్మడిగా ఓటేయడం పటీదార్ల బలం. ఇప్పుడు అది బీజేపీకి వ్యతిరేకంగా మారడం మోదీ ఆందోళనకు కారణం. దాదాపు 70 నియోజకవర్గాల భవితవ్యాన్ని పటీదార్లు తేల్చనున్నారు.

ముగ్గురూ కలిస్తే
రాష్ట్రంలో మొత్తం 182 నియోజకవర్గాలు ఉండగా, హార్థిక్‌ పటేల్‌, అల్పేశ్‌ ఠాకూర్‌, జిగ్నేశ్‌ మేవానీ కలిసి 125 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలరని విశ్లేషకుల అంచనా.

వీరికితోడు ముస్లిములు కూడా కాంగ్రెస్‌ పక్కనే ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి అధికార పార్టీతో తెరవెనుక జట్టుకట్టిన వృద్ధ నేతలను పక్కన పెట్టడంతో ఆ పార్టీతో జట్టుకట్టడానికి ఈ యువ నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది.

Leave a comment