Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

రాహుల్ ను న‌డిపించే సార‌ధులు

Published on Dec 05 2017 // Politics

ఈ ఏడాది మే నెలలోనే రాహుల్‌ తన సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ బృందంలోని వారి సగటు వయసు 42 ఏళ్లు. ఆ బృందం సభ్యులు వీరే…

రణ్‌దీప్‌ సుర్జేవాలా(50)
హరియాణా ఎమ్మెల్యే, ఏఐసీసీ సమాచార విభాగం ఇన్‌చార్జి. రాహుల్‌ నిత్యం టచ్‌లో ఉండే అతికొద్ది మందిలో ఈయన ఒకరు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని రాహల్‌కు చేరవేస్తారు. వ్యూహ రచనలో కీలక పాత్ర ఆయనదే. 2015 నుంచే రాహుల్‌ వెంట ఉన్నారు.

దివ్య స్పందన (35)
కన్నడ నాట ప్రముఖ కథానాయిక రమ్య అసలు పేరు దివ్య స్పందన. 2013లో ఆమె మాండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఈ ఏడాదిలో మేలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఆమెను స్వయంగా రాహుల్‌ ఎంపిక చేశారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
రాజీవ్‌ సతవ్‌(45)
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరు ఎంపీల్లో ఒకరు. ఏఐసీసీ కార్యదర్శి. మాజీ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడైన రాజీవ్‌ పార్లమెంటులో రాహుల్‌ అజెండాను బలంగా వినిపిస్తుంటారు. ఇప్పటి వరకు 11 ప్రైవేటు బిల్లలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

అమరీందర్‌ సింగ్‌ రాజా(40)
పంజాబ్‌కు చెందిన ఎమ్మెల్యే, యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌గా అమరీందర్‌ తన పనితీరుతో రాహుల్‌ను ఆకట్టుకున్నారు. వ్యాపం స్కాం, మధ్యప్రదేశ్‌ విధాన సభ వద్ద భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ధర్నా వంటి విషయాలతో ఈయన రాహుల్‌ దృష్టిని ఆకర్షించారు.
సచిన్‌ పైలట్‌(40)
రాజస్థాన్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు. ఆ రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాహుల్‌ నమ్మిన బంటుల్లో ఒకరు.

జ్యోతిరాదిత్య సింధియా(46)
మధ్యప్రదేశ్‌ నుంచి ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్‌ రాజ కుటుంబీకుడు. తొలి నుంచీ రాహుల్‌ విశ్వసించే వారిలో ఒకరిగా స్థానం పొందారు.

Leave a comment