Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

జపాన్‌ క్షిపణి ప్రయోగానికి సన్నాహాలు

Published on Dec 05 2017 // National

దాదాపు రెండు నెలల పాటు నిశ్శబ్దంగా ఉన్న కయ్యాలమారి ఉత్తరకొరియా తాజాగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించి మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది.

హ్వాసంగ్‌ 15 పేరుతో ఉన్న ఈ క్షిపణిని జపాన్‌ జలాల్లో పడేసింది. దీంతో ఉత్తరకొరియాపై అమెరికా సహా ప్రపంచదేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

అయితే ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పేందుకు అటు జపాన్‌ కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఉత్తరకొరియా మిసైల్‌ సైట్‌ను చేరేలా భారీ సామర్థ్యం ఉన్న క్షిపణిని కొనుగోలు చేసేందుకు జపాన్‌ సన్నాహాలు చేపట్టినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
ఇప్పటికే ఇందుకోసం కొంత నిధులను కూడా కేటాయించారట. వచ్చే ఏడాది బడ్జెట్‌లో క్షిపణి కొనుగోలు కోసం నిధులు కేటాయించనున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు. 1000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేరుకునే క్షిపణి కోసం జపాన్‌ చూస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే జపాన్‌ రక్షణ శాఖ ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఈ కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు లేవు. కానీ ఈ మధ్య ఉత్తరకొరియా నుంచి ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా జపాన్‌ తన ప్రణాళికలో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా జపాన్‌ రాజ్యాంగం ప్రకారం.. 300 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం వెళ్లే క్షిపణులను ఆ దేశం ఉపయోగించరాదు. దీంతో తాజా కొనుగోళ్లు అక్కడ వివాదాస్పదంగా మారే అవకాశముంది. అయితే క్షిపణి కొనుగోళ్ల వార్తపై ఆ దేశ రక్షణ మంత్రి ఇసునోరి ఒనోడెరా స్పందించారు.

ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఉత్తరకొరియాకు వ్యతిరేకంగా ప్రస్తుతం తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని.. అంతేగానీ వ్యక్తిగతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోమని ఇసునోరి స్పష్టం చేశారు.

Leave a comment