Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ట్రంప్‌ ట్రావెల్‌ బ్యాన్‌పై సుప్రీం కీల‌క‌తీర్పు

Published on Dec 05 2017 // NRI

ముస్లిం మెజార్టీ దేశాల నుంచి ప్రజలు అమెరికా రాకుండా ఉండేందుకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్యావెల్‌ బ్యాన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం కొన్ని ఆంక్షలతో కొనసాగుతున్న ఈ నిషేధంపై ఆ దేశ సుప్రీంకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఇక పూర్తిస్థాయిలో నిషేధం అమలు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజులకే ట్రంప్‌ ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇరాన్‌, లిబియా, సిరియా, యెమన్‌, సోమాలియా, ఛాద్‌ దేశాల నుంచి ప్రజలెవరూ అమెరికా రాకుండా వారిపై నిషేధం విధించారు.

అయితే ట్రంప్‌ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారించిన న్యాయస్థానాలు ట్రావెల్‌ బ్యాన్‌పై కొన్ని ఆంక్షలు విధించాయి.

ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల దగ్గరి సంబంధీకులు అంటే అమ్మ, నాన్న, కొడుకు, కుమార్తె తదితర బంధువులకు అమెరికాలో శాశ్వత నివాసం ఉంటే వారికి అనుమతినివ్వాలని కింది కోర్టులు పేర్కొన్నాయి.

అయితే తాజాగా సుప్రీంకోర్టు.. నిషేధంపై కింది కోర్టులు విధించిన ఆంక్షలను ఎత్తివేసింది. పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేయాలని పేర్కొంది. అయితే ఇందులో న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. దీంతో ప్రస్తుతంఅధికారులు నిషేధంపై న్యాయ అంశాలను పరిశీలిస్తున్నారు.

Leave a comment