Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఐటిసెల్ స‌భ్యుల రాజీనామ‌

Published on Dec 04 2017 // Politics

రాజ్‌కోట్‌లోని ఐటీ సెల్ విభాగం మొత్తం రాజీనామా
దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్
సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన రాజ్‌కోట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు
గుజరాత్ ఎన్నికల్లో గెలిచి అధికార బీజేపీపై పై‘చేయి’ సాధించాలనుకుంటున్న కాంగ్రెస్‌కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది.

రాజ్‌కోట్‌లో ఆ పార్టీకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగానికి చెందిన 200 మందికిపైగా సభ్యులు రాజీనామా చేశారు. ఐటీ యూనిట్ మొత్తం రాజీనామాలు సమర్పించడంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితికి చేరుకుంది. సోషల్ మీడియా ప్రచారం ఎలా నిర్వహించాలో తెలియక తలలు పట్టుకుంది.

కాంగ్రెస్ రాజ్‌కోట్ సిటీ యూనిట్ తమను విస్మరిస్తున్నందుకు నిరసనగానే వీరంతా రాజీనామాలు చేసినట్టు తెలుస్తోంది. సభ్యులందరూ కలిసి ఒకే రాజీనామా లేఖను గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఐటీ సెల్ చైర్మన్ రోహన్ గుప్తాకు అందించారు.

పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకపోయినా ఐటీ విభాగం సమర్థవంతంగా పనిచేస్తోందని, అయినప్పటికీ తమను విస్మరిస్తున్నారని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. యూనిట్ మొత్తం రాజీనామాలు సమర్పించడంతో రాజ్‌కోట్ సిటీ యూనిట్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేష్ రాజ్‌పుట్ రంగంలోకి దిగారు.

సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఈనెల 9న జరగనుండగా 14న రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 18న ఫలితాలు వెల్లడిస్తారు

Leave a comment