Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

దక్షిణ కొరియాకు సీఎం చంద్ర‌బాబు బృందం

Published on Dec 04 2017 // News

నేటి నుంచి 3 రోజులు సియోల్‌, బూసన్‌ నగరాల్లో పర్యటన
అనంతపురంలో అంతర్జాతీయ పారిశ్రామిక నగరం ఏర్పాటుపై ఎసెట్జ్‌ గ్రూపుతో ఒప్పందం?

పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం మూడు రోజుల దక్షిణ కొరియా పర్యటనకు ఆదివారం రాత్రి బయలుదేరి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం సోమవారం వేకవజామున 2.20 గంటలకు సియోల్‌ విమానాశ్రయానికి ఈ బృందం చేరుకోనుంది.

ఈ నెల ఆరో తేదీ వరకూ చంద్రబాబు, బృందంలోని సభ్యులు దక్షిణ కొరియాలోని సియోల్‌, బూసన్‌ నగరాల్లో పర్యటిస్తారు. తొలి రోజైన సోమవారం చంద్రబాబు దక్షిణ కొరియాలో భారత రాయబారి విక్రమ్‌ దొరైస్వామితో భేటీ అవుతారు.

అనంతరం కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో పాటు, జుసంగ్‌ ఇంజినీరింగ్‌ సీఈవో వాంగ్‌ చుల్‌ జూ, ఇరిటెక్‌ సీఈవో కిమ్‌ దే హున్‌, లొట్టే కార్పొరేషన్‌ సీఈవో వాంగ్‌ కాగ్‌ జూలతో సమావేశమవుతారు. 3రోజుల పర్యటనలో భాగంగా మొత్తం ఆరు ద్వైపాక్షిక సమావేశాలు, రెండు బృంద సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు.

రెండు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు వాణిజ్య సదస్సులకు హాజరవుతారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, అమర్‌నాథ్‌రెడ్డి, సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఉన్నతాధికారులు సాయిప్రసాద్‌, ఆరోఖ్యరాజ్‌, ఎ.బాబు, జాస్తి కృష్ణకిశోర్‌ ఈ బృందంలో ఉన్నారు.

పర్యటన విశేషాలు..
* అనంతపురంలో అంతర్జాతీయ స్థాయి ఆకర్షణీయ పారిశ్రామిక నగరం ఏర్పాటుపై ఎసెట్జ్‌ గ్రూపు, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి మధ్య ఒప్పందం. దీనిలో 29 కంపెనీలు భాగస్వామ్యం అవుతాయి. కియా మెటార్స్‌కు చెందిన 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి మధ్య ఒప్పందం
* బూసన్‌ పారిశ్రామిక నగరం, ఏపీఐఐసీ మధ్య ఒప్పందం జరిగే అవకాశం

పర్యటనలో మరికొన్ని ప్రధానాంశాలు
* కియా మెటార్స్‌ ప్రధాన కార్యాలయం సందర్శన
* కృష్ణపట్నంపోర్టుతో భాగస్వామ్యానికి సంబంధించి వాణిజ్య సదస్సులో పాల్గొంటారు
* బూసన్‌ నగరంలోని న్యూపోర్టు కంపెనీ, మేకిన్‌ ఇండియా సెంటర్‌, నాక్‌-శాన్‌ నేషనల్‌ ఇండస్ట్రీయల్‌ కాంప్లెక్స్‌, మయోంగ్జీ స్వేచ్ఛా ఆర్థిక మండలిని సందర్శిస్తారు.

Leave a comment