Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

వైకాపాలోకి క‌ర్నూలు నుంచి మ‌రోనేత‌

Published on Dec 04 2017 // Politics

కర్నూలు వైసీపీ నేత రామచంద్రారెడ్డి టీడీపీలోకి
త్వరలో పసుపు కండువా కప్పుకునేందుకు సన్నాహాలు
కర్నూలు ఎమ్మెల్యేకు రామచంద్రారెడ్డి స్వయానా బావమరిది
కర్నూలు: వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు మరో నేత రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు జిల్లా వైసీపీ నేత రామచంద్రారెడ్డి త్వరలో పార్టీ మారబోతున్నారు.

కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి రామచంద్రారెడ్డికి స్వయాన బావ. 2014 ఎన్నికల్లో రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి ఎస్‌.నాగరత్నమ్మ నాటి వైసీపీ అభ్యర్థి కోట్ల హరిచక్రపాణిరెడ్డి గెలుపు కోసం పని చేశారు. ఎన్నికల తర్వాత జరిగిన రాజకీయ సమీకరణలో భాగంగా స్వయాన బావ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ టీడీపీలో చేరినా.. రామచంద్రారెడ్డి దంపతులు మాత్రం వైసీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఆ పార్టీలో సరైన గుర్తింపు లేకపోవడంతో కొన్నాళ్లుగా తటస్థంగా ఉంటున్నారు.

అక్టోబరు 27న పత్తికొండ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కుడా ఛైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీఎస్‌ఐడీసీ చైర్మన్‌, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌, కేడీసీసీ బ్యాంక్‌ ఛైర్మన్‌ మల్లికార్జునరెడ్డి తదితరులు రామచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి చర్చించడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఇందులో భాగంగానే పత్తికొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం కేఈతో కలిసి సీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు భారీ బహిరంగ సభ నిర్వహించి జనసందోహం మధ్య టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

రాబోయే ఎన్నికల్లో కర్నూలు, పత్తికొండ నియోజకవర్గాల్లో ఎస్వీ, కేఈ కుటుంబాలు రాజకీయంగా ఒకరికొకరు సహకారం అందించుకోవడంలో భాగంగానే రామచంద్రారెడ్డి దంపతుల చేరిక కీలకమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Leave a comment