Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

ఎర్రమిర్చి.. యవ్వారం

Published on Dec 04 2017 // News

01. సిగరెట్ ప్యాకెట్లపై పుర్రె బొమ్మలతో పాటూ – యాంటీ స్మోకింగ్ పై అవగాహన కల్పించే టోల్ ఫ్రీ నంబర్ 1800227787 ని కూడా ముద్రించాలని నిర్ణయించిన – కేంద్ర ప్రభుత్వం…
ఈళ్ళెవరూ ఇంకా ఆక్షిజన్ సినిమా చూసుండరు – లేకపోతే దాని లింకు కూడా అచ్చేసేటోళ్ళు…!!

02. నిరుద్యోగం కారణంగానే ఓయూ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్నాం – ప్రొ. కోదండరాం …
నిరుద్యోగమంటే గవర్నమెంటు ఉద్యోగం లేకపోవటమా లేక చేయటానికీ అసలే పనీ లేకపోవటమా…?? – మీ చెత్త రాజకీయాల కోసం అసలేం నూరిపోస్తున్నారో అర్థమవుతోందా ఎవడికన్నా…??

03. పోలవరం విషయంలో పూర్తి సహకారం ఉంటుంది – తెలుగుదేశంతో పొత్తనేది కాలమే నిర్ణయిస్తుంది – భాజపా నేత సోము వీర్రాజు…
పొత్తులూ – ఒత్తులు – మొక్కజొన్నపొత్తులు అన్నిటినీ పోగాలమే నిర్ణయిస్తాదిలే – అందులో సందేహమే లేదు…!!

04. ఓకీ తుఫాను గుజరాత్ తీరం వైపు వెళ్ళి బలహీనమవటంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న దక్షిణ తమిళనాడు , కేరళ ప్రజలు…
అనిరుధ్ పేరుతో మహేష్ బాబు బ్రహ్మోత్సవాన్ని తమిళంలో పొంగల్ కి రిలీజ్ చేసే ఆలోచనలో – కొందరు తమిళ నిర్మాతలు …!!

05. మేం అధికారంలోకి వస్తే రైతులు పంట వేసే ముందరే గిట్టుబాటు ధరని ప్రకటిస్తాం – జగన్ …
ఇంకానయం – స్టూడెంట్లు పరీక్షలు వ్రాయక ముందరే ర్యాంకులు ప్రకటిస్తామనలేదు…!!

Leave a comment