Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

జ‌య‌ల‌లిత బంధం వాస్త‌మే..?

Published on Dec 04 2017 // News

1979లోనే అంగీకరించిన జయలలిత.. వివాహితుడైనందునే పెళ్లి చేసుకోలేకపోతున్నా
ఆయనతో బంధాన్ని దాచిపెట్టాల్సిన పనిలేదు
స్టార్‌ అండ్‌ స్టైల్‌ ఆంగ్ల పత్రికకు స్వయంగా లేఖ
అమృత.. జయ, శోభన్‌బాబు దాంపత్య ఫలమేనా?
బిడ్డ ఉన్న మాట వాస్తవం.. జయ మేనత్త కూతురు లలిత
‘నిజం నిద్రపోదు- దాచినా దాగదు’.. ఈ మాటలు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత విషయంలో అక్షరసత్యాలు. తమిళ రాజకీయాల్లో నాటి నుంచి నేటి దాకా నేతల వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితంపై బహిరంగ విమర్శలు రావటం సర్వసాధారణం.

తమిళ ప్రజల ‘అమ్మ’గా పేరు గడించిన జయ దీనికి మినహాయింపేమీ కాదు. ఆమె మృతి చెంది ఏడాది అవుతున్నా ఆమె వ్యక్తిగత జీవితంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన మంజుల అలియాస్‌ అమృత తానే జయ కుమార్తెనంటూ ప్రకటించి కలకలం రేపారు. డీఎన్‌ఏ పరీక్షలకు కూడా సిద్ధమని ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చి కర్ణాటక హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. సుప్రీంకోర్టులో అమృత దాఖలు చేసిన పిటిషన్‌ ప్రకారం.. 1980 ఆగస్టు 14న జయలలిత, అమృతకు జన్మనిచ్చారు. తన పెంపుడు తల్లి శైలజ 2015లో మరణించిందని, తండ్రి ఈ ఏడాది మార్చి 20న మృతి చెందాడని, జయలలిత బతికున్నప్పుడు కుమార్తెనని ప్రకటించుకుంటే ఆమె కీర్తి ప్రతిష్ఠలు దిగజారుతాయని ఆ రహస్యాన్ని దాచి పెట్టానని అమృత తెలిపారు. కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ వేయడానికి ఆమె సిద్ధమవుతున్నారు.

జయకు బిడ్డ ఉన్న మాట వాస్తవమేనని ఆమె మేనత్త కూతురు లలిత కూడా ఇటీవల వెల్లడించారు. దివంగత తెలుగు సినీనటుడు శోభన్‌బాబు, జయలలిత దాంపత్య ఫలితంగానే తాను జన్మించానని అమృత చెబుతున్న నేపథ్యంలో జయ, శోభన్‌బాబు మధ్య బంధం మరోసారి చర్చనీయాంశమైంది.

ఉవ్వెత్తున ఎగిసిన కెరటం!
తమిళనాటే కాదు దక్షిణభారత చలనచిత్ర రంగంలో తిరుగులేని నాయకిగా ఓ వెలుగు వెలిగారుజయలలిత. తమిళ వెండి తెర వేల్పు ఎంజీఆర్‌తో కలిసి ఆమె చేసిన తొలి చిత్రం ‘ఆయిరత్తిల్‌ ఒరువన్‌’తో ఆమె కెరీర్‌ ఉవ్వెత్తున ఎగసింది. పదేళ్లలో తమిళ, తెలుగు, కన్నడ, హిందీసహా పలు భాషల్లో వందకుపైగా చిత్రాలలో నటించి సంచలనం సృష్టించారు. దక్షిణాది హీరోలు జయలలితతో నటించేందుకు పోటీ పడేవారు.

ఇక తమిళనాట ఎంజీఆర్‌- జయలలిత జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఎంజీఆర్‌తో కలిసి ఆమె 28 సినిమాలలో నటించారు. అయితే ‘పట్టికాట్టు పొన్నయ్య’ అనే చిత్రంలో నటిస్తున్నప్పుడు ఈ జంట మధ్య మనస్పర్థలు వచ్చాయి.

దీనికి కారణం ఎంజీఆర్‌ డ్రీమ్‌ ప్రాజెక్టు ‘ఉలగం సుట్రం వాలిబన్‌’ చిత్రంలో ఎంజీఆర్‌ జయను హీరోయిన్‌గా ఎంపిక చేయకపోవటమే. ఎంజీఆర్‌ ఆ చిత్రంలో కొత్త తారలు లత, మంజుల, చంద్రకళను ఎంపిక చేశారు. ఇది జయకు కంటగింపుగా మారింది. అదే సమయంలో 1971లో ఆమె తల్లి మృతి చెందారు.

1973లో ఎంజీఆర్‌కు జయ దూరంగా జరిగారు. ఆ తర్వాత జయ వ్యక్తిగత జీవితం పలు మలుపులు తిరిగింది. ఎంజీఆర్‌కి దూరమైన తర్వాత జయకు సినీ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. 1975లో సినిమాలలో నటించడం మాని ఒంటరిగా గడిపేవారు.

మా నడుమ గాఢమైన బంధం ఉంది!
అలాంటి తరుణంలో హీరో శోభన్‌బాబుతో జయ సన్నిహితంగా ఉంటున్నారంటూ పత్రికలలో కథనాలు వెలువడ్డాయి. తెలుగులో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ తర్వాత కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ మహిళలు మెచ్చిన నటుడిగా పేరుగడించిన శోభన్‌బాబుతో జయ అంతకు ముందే కొన్ని చిత్రాలలో జంటగా నటించినా వారి మధ్య అంతగా సంబంధాల్లేవు. ఎంజీఆర్‌కు దూరమైన తర్వాతే ఆమెహీరో శోభన్‌బాబుకు చేరువయ్యారు.

1979లో ‘స్టార్‌ అండ్‌ స్టైల్‌’ అనే ఆంగ్ల పత్రికలో వీరిరువురి రహస్య దాంపత్యంపై వార్త ప్రచురితమైంది. ఆ వార్తకు స్పందిస్తూ జయ ఆ పత్రికకు ఘాటైన లేఖ రాశారు. అందులో ఆ పత్రికా విలేకరి అయోమయంలో ఉన్నట్లు అనిపిస్తోందని, శోభన్‌బాబుతో తాను ఏడేళ్లపాటు ‘గోయింగ్‌ స్టడీ’ గాఢమైన అనుబంధం కలిగి ఉన్నానని, ఈ బంధం తన జీవితాంతం కొనసాగాలనే కోరుకుంటున్నానని కుండబద్దలు కొట్టినట్లు వివరించారు.

తమ మధ్య బంధాన్ని తానెన్నడూ దాచిపెట్టలేదని, సినిమాలలో మునుపటిలా నటిస్తుంటే ఇమేజ్‌ కోసం దాచి పెట్టి ఉండేదానినని కూడా వివరించారు. తమిళ వారపత్రిక ‘కుముదం’ జయ ఆంగ్ల పత్రికకు రాసిన ఉత్తరాన్ని తమిళంలో అనువదించి అప్పట్లో ప్రచురించింది. మళ్లీ జయ ఆ తమిళ పత్రిక విలేకరిని తన వద్దకు పిలిపించుకుని శోభన్‌బాబుతో తనకున్న బంధం చాలా పవిత్రమైనదని చెప్పారు.

అంతటితో ఆగకుండా ‘తాళి కడితేనే భార్యాభర్తల బంధం ఉన్నట్లు అర్థమా, ఏ యువతీ పెళ్లయినవాడిని ఉద్దేశపూరితంగా ప్రేమించదు. తనకు అండగా నిలిచే వ్యక్తి కావాలనే కోరుకుంటుంది. ఊహించని విధంగా ఆయనతో మైత్రీబంధం కాస్త పవిత్రబంధంగా మారింది.

ఇందులో ఆయనను తప్పుపట్టాల్సిన పనిలేదు. నేనాయనను కలుసుకునేటప్పటికే ఆయన వివాహితుడు. భార్యకు విడాకులిప్పించి ఇద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా అని అందరూ అడుగుతున్నారు.

అది చాలా తప్పు. ఏ నేరమూ చేయని ‘ఆమె’ను ఎందుకు మేం నిరాకరించాలి? నా వల్ల వారి జీవితానికి ఎలాంటి నష్టం కలుగకూడదనే ఈ గాఢమైన బంధం గురించి మౌనంగా ఉన్నాను’ అని జయ వివరించారు. ఈ సంఘటనల తర్వాతే జయ, శోభన్‌బాబుల రహస్య జీవనం లోకానికి బహిర్గతమైంది.

ఎంజీఆర్‌ జోక్యంతో ముగిసిన బంధం!
చాలాకాలం కొనసాగిన జయ, శోభన్‌ బంధం ఎంజీఆర్‌ జోక్యంతో ముగిసిపోయిందని అప్పట్లో పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు ప్రచురితమయ్యాయి. 1982లో మళ్లీ ఎంజీఆర్‌కు జయ చేరువయ్యారు. తిరిగొచ్చిన జయకు ఎంజీఆర్‌ రాజకీయంగా మంచి ప్రాధాన్యం కల్పించారు.

రాజకీయాల్లో బిజీగా మారటంతో శోభన్‌బాబు ఆమె జ్ఞాపకాల నుంచి శాశ్వతంగా దూరమైపోయారు. జయ రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు శోభన్‌బాబుతో ఆమె బంధం గురించి 1989లో డీఎంకే పార్టీ పత్రిక మురసొలి నాలుగుపేజీల కథనాన్ని ఫొటోలతో సహా ప్రచురించింది. ఆ ఫొటోలు ఇరువురినీ దంపతులుగా తలపించే రీతిలో ఉన్నాయి.

పోయెస్‌గార్డెన్‌లో శోభన్‌బాబుకు జయలలిత భోజనం వడ్డిస్తుండటం, ఇంటి గోడపై ఉన్న తన ఫొటోలను శోభన్‌బాబుకు చూపుతుండటం, తన ప్రత్యేక గదిలో శోభన్‌తో కబుర్లాడుతుండటం, బాల్కనీపై నిలిచి ఆయనకు టాటా చెబుతుండటం వంటి దృశాలతో ఉన్న ఆ ఫొటోలు సంచలనం రేపాయి.

ఈ కథనంపై జయ కాస్త కుదుపునకు గురయ్యారు. కానీ ఆమె అధికార పీఠాన్ని అఽధిష్టించిన తర్వాత అవన్నీ తెరమరుగైపోయాయి. పాతపడిన ఆ సంగతులన్నీ జయ మృతి తర్వాత మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి.

సామాన్యులకు అంతుచిక్కని ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఆసరాగా తీసుకొని తామే ఆమె వారసులమంటూ పలువురు తెరపైకి వచ్చారు. అసలు జయకు వారసులున్నారా? అమృత.. జయ, శోభన్‌ దాంపత్య ఫలమేనా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి..

Leave a comment