Connect with us :- Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Google+

TODAY

12:31 pm - ‘అమ్మ మృతి’పై కొనసాగుతున్న విచారణ// 12:30 pm - తిరుమలలో వేగంగా రింగురోడ్డు పనులు// 12:00 pm - ఐకాసాలో అమెరికాకు ఎదురుదెబ్బ// 11:59 am - బాలీవుడ్ సుంద‌రిగ‌ ప్రియాంకాకే గుర్తింపు// 11:55 am - ఎర్రమిర్చి.. యవ్వారం// 11:53 am - పాక్‌లో పడవ మునిగి 21 మంది మృతి// 11:51 am - తోటి జర్నలిస్ట్ హత్యకు సుపారీ..?// 11:46 am - గుజ‌రాత్‌లో కాంగ్రెస్‌కు ఎన్నికల సంఘం ఝలక్// 11:41 am - తమిళ ప్రజలకు నటుడు విశాల్ బహిరంగ లేఖ// 11:39 am - ఇట‌లిలో విరాట్,అనుష్క‌ల‌ పెళ్లి..?// 11:38 am - సిఎం హెలికాప్టర్‌ను బలవంతంగా దించేశారు..!// 11:37 am - అయ్య‌ర్‌తో సమావేశం జరిగింది- పాక్// 2:51 pm - ఎర్ర‌మిర్చి..య‌వ్వారం..// 2:41 pm - డ్రోన్‌ సరిహద్దు దాటిందని చైనాకు చెప్పాం// 2:40 pm - జనవరి 1 నుంచి..కరెన్సీ కాదు.. కార్డుతోనే..!// 2:34 pm - మీడియాపై మణిశంకర్ అయ్యర్ దురుసు// 2:33 pm - పోలవరంపై రాజీప్రసక్తే లేదు -బాబు// 2:32 pm - శ్రీ శ్రీ రవిశంకర్‌పై హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం// 2:26 pm - పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు కౌంటర్// 2:24 pm - నాకు భయంగా ఉంది-: న‌టుడు విశాల్//

FILM NEWS

Published on Dec 03 2017 // Movie News

* ఇటీవలి కాలంలో తనకు వస్తున్న పాత్రలు సంతృప్తికరంగా ఉంటున్నాయని అంటోంది అందాలభామ కాజల్. “గతంతో పోల్చుకుంటే కనుక గత మూడేళ్ల నుంచీ నాకు వస్తున్న పాత్రలు బాగుంటున్నాయి. పాత్ర వినగానే వదులుకోబుద్ధి కావడం లేదు. అందుకే, చేసేస్తున్నాను. ఆ విధంగా ఇటీవలి కాలంలో నా కెరీర్ సంతృప్తికరంగా ఉందనే చెప్పాలి” అని చెప్పింది.

* వెంకటేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ రేపు (సోమవారం) రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం అవుతుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెల రెండో వారం నుంచి జరుగుతుంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఇది తెరకెక్కుతుంది. దీనికి ‘ఆట నాదే వేట నాదే’ అనే టైటిల్ని నిర్ణయిస్తున్నారు.

* వినూత్న కథా చిత్రాలలో నటించే నేచురల్ స్టార్ నాని ‘వాల్ పోస్టర్’ పేరిట సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ‘అ!’ పేరిట ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ నచ్చడంతో రవితేజ, కాజల్, నిత్యా మీనన్ వంటి తారలు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు.

* మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఏర్పడి పాతికేళ్లు అయిన సందర్భంగా నిన్న హైదరాబాదులో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి, సీనియర్ నటుడు రాళ్లపల్లిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీతారలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a comment